Thursday, May 16, 2024
- Advertisement -

పవన్ కి ఫోన్ చేసిన చిరు.. ఎందుకంటే..?

- Advertisement -
katamarayudu teaser effect chiranjeevi telephoned pawan kalyan

చిరంజీవి అంటే పవన్ కి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. పలు పంక్షన్ లో చిరు పై తనకు ఉన్న ప్రేమను చాలా సార్లు చెప్పారు పవన్ కళ్యాణ్. అలాగే తమ్ముడు పవన్ అంటే కూడా అన్నయ్య చిరంజీవికి కూడా అంతే ప్రేమ. తన పెద్ద కొడుకులా పవన్ ని భావిస్తాడు చిరు. అంతాల వీరిద్దరి మధ్య ప్రేమ ఉంది. అయితే ఇటివలే మెగాస్టార్ చిరు.. పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసాడట.

చిరు.. పవన్ కి ఫోన్ ఎందుకు చేసాడంటే.. తొమ్మిది ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చిరు.. సమయం లేక సినిమాలపై దృష్టి పెట్టలేకపోయారు. అయితే ప్రస్తుతం ఆయన తన ఫోకస్ అంతా సినిమా రంగంపైనే పెట్టారు. ఇండస్ట్రీలో జరుగుతున్న సినిమా షూటింగుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఏదైనా ట్రైలర్ రిలీజైనా, సినిమా రిలీజైనా చూసి తన అభిప్రాయం వెల్లడించడం, వారిని ప్రోత్సహించడం లాంటివి చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కాటమరాయుడు’ టీజర్ రిలీజ్ అయి రికార్ట్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకోవడంతో చిరంజీవి స్వయంగా తమ్ముడికి ఫోన్ చేసి అభినందించారని తెలుస్తోంది.

అన్నయ్య ఫోన్ చేయడంతో తమ్ముడు చాలా సంతోష పడ్డాడట. ఇక మెగాస్టార్ ఖైదీ మూవీ భారీ విజయం సొంతం చేసుకోవడంతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ సక్సెక్ ఇచ్చిన ఉత్సాహంతో ఈ ఏడాది రెండు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో ఒకటి రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినమా అయితే, మరొకటి గీతా ఆర్ట్స్ బేనర్లో బోయపాటి దర్శకత్వంలో చేయబోతున్నారు. 

Related

  1. అన్నయ్యను ఇంటికి వెళ్లిన పవన్.. ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు!
  2. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్!
  3. బన్నీపై ఫైర్ అవుతున్న.. పవన్, బాలయ్య ఫ్యాన్స్!
  4. పవన్ చేయబోయే చివరి సినిమా అదేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -