Friday, May 10, 2024
- Advertisement -

అనసూయ కోసం సుమ ఏం చేసిందో తెలుసా..?

- Advertisement -
Anchor Suma Sings Suyasuya Song For Anasuya

యాంకర్ సుమ కు.. బుల్లితెర పై యాంకర్ గా.. ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకించి చెప్పకర్లేదు. కేవలం బుల్లితెరపైనే కాకుండా సినిమా పంక్షన్స్ కి హోస్ట్‌గా కూడా చేస్తోంది. సుమ మలయాళీ అమ్మాయి అయిన.. తెలుగు మాత్రం చాలా స్వచ్ఛంగా మాట్లాడుతోంది. సుమ వాయిస్ లో చాలానే బేస్ ఎనర్జీ ఉంటుంది.

సుమ వాయిస్ ను గుర్తించిన ఎస్ ఎస్ థమన్.. ఇప్పుడు ఆమెతో ఓ పాట పాడించేశాడు. అది కూడా మెగా మూవీ కోసం కావడం ఒక విశేషం అయితే.. మరో హాట్ యాంకర్ అనసూయ చేసిన ఐటెం సాంగ్ కోసం కావడం మరో స్పెషాలిటీ. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సాయి ధరంతేజ్ హీరోగా విన్నర్ సినిమా తెరకెక్కుతోంది. విన్నర్ పాటలను.. స్టార్స్ తో లాంఛ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే మహేష్ బాబు.. సమంతలు ఒక్కో పాటను లాంఛ్ చేయగా.. ఇవాళ సాయంత్రం 7 గంటలకు “సుయ సుయ” అంటూ సాగే పాటను కోలీవుడ్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ లాంఛ్ చేశారు. ఇది ఐటెం సాంగ్ కాగా.. హాట్ యాంకర్ అనసూయ మొదటిసారిగా ఈ మూవీలో ఐటెం సాంగ్ చేసింది.  ఆ పాటను సుమ పాడడమే ఈ పాటలో అసలు సిసలైన స్పెషాలిటీ. ఈనెల 24న విన్నర్ సినిమాని విడుదల చేయబోతున్నారు.

{youtube}VX2OqnR1xgk{/youtube}

Related

  1. బిత్తిరి స‌త్తికి షాక్ ఇచ్చిన యాంకర్ సుమ!
  2. యాంకర్ సుమ పెద్ద అబద్ధాలకోరంట.. సుమపై దర్శకుడి కామెంట్స్!
  3. యాంకర్ సుమకి షాక్ ఇచ్చిన యంగ్ హీరో!
  4. రష్మీకి ప్రపోజ్ చేసిన సుమంత్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -