Monday, May 6, 2024
- Advertisement -

స్పైడర్ ప్లాప్ మూవీ అని చెప్పిన మహేష్

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టా మహేష్ బాబు తాజా సినిమ స్పైడర్. దసరా కానుకగా ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. మురుగదాస్ డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే మిక్స్‌డ్ టాక్ వినిపిస్తున్నాయి. అయితే సినీ విశ్లేషకుడు మ‌హేష్ క‌త్తి ఏమాత్రం బాగాలేదని తేల్చి చెప్పారు.

ఆయన ఇచ్చిన రివ్యూలో స్పైడర్ సినిమాపై ఎక్కువ గా నెగటివ్ కామెంట్స్ చేశాడు. కత్తి మహేష్ రివ్యూ ప్రకారం.. స్పైడర్ ఫోన్ డేటా బేస్ చేసుకుని ఓ సూపర్ హీరో ప్రజల బాధలు తెలుసుకుని వాళ్లను ఎలా రక్షిస్తాడనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. వినడానికి చాలా మంచిగా ఉన్న ఈ కథను మంచి సినిమాగా మలచడంలో దర్శకుడు మురుగదాస్ విఫలం అయ్యాడు. అలానే ప్రేక్షకుల సహనాన్నికి స్పైడర్ పెద్ద పరీక్షగా మారింది. వీఎఫ్ఎక్స్ వర్క్స్‌ బాగాలేదని.. ఇక మహేష్ సూపర్బ్ యాక్టింగ్‌.. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను సీటులో నుంచి లేచి వెళ్లిపోకుండా కూర్చోబెడతాయి.

హారిశ్ జైరాజ్ సంగీతం పెద్దగా బాలేదని.. రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈ సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ లేదని.. ఓవరాల్‌గా ఏఆర్‌.మురుగదాస్ ఓ నిరుత్సాహమైన సినిమాను ప్రేక్షకులకు అందించాడని మహేష్ కత్తి తెలిపాడు. ఫైనల్‌గా స్పైడర్ సినిమా ఏమాత్రం బాగోలేదని కత్తి తేల్చేశాడు. దాంతో మొన్నిటివరకు పవన్ ఫ్యాన్స్ మహేష్ కత్తి పై ఫైర్ అవుతే.. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ మహేష్ కత్తి పై ఫైర్ అవుతున్నారు. మరి మహేష్ కత్తి ఈ సారి మహేష్ అభిమానుల నుండి ఎన్ని ఇబ్బందులు ఎదురుకుంటాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -