ఏపీ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ కి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. అయితే ఈ సారి ఈ దెబ్బ ఊహించని విధంగా ఆయన సతీమణి భారతిరెడ్డి కి తగలింది. విషయంలోకి వెళ్తే.. అప్పట్లో విజయవాడ కేంద్రంగా సంచలనం సృష్టించిన కాల్ మనీ వ్యవహారం గురించి అందరికి తెలిసిందే.
అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడం ఈ కాల్ మనీ అనే వ్యవస్థని ఉక్కుపాదం తో తోక్కేయటం జరిగినవి. అయితే అప్పట్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అన్న క్రమం లో సాక్షి దినపత్రిక సరైన సాక్ష్యాలు లేకుండా పలువురి పై అభాండాలు మోపింది అని తెలుగుదేశం వర్గాలు తీవ్రంగా దుయ్యబట్టారు. అయితే కృష్ణా జిల్లా తెలుగు రైతు విభాగానికి అద్యక్షత వహిస్తున్న చలసాని ఆంజనేయులు.. ఇక అడుగు ముందుకు వేసి.. సాక్షి పత్రిక పై పరువునష్టం దావా వేశారు.
తనకు ఎటువంటి సంబంధం లేని కాల్ మనీ వ్యవహారం లో తన ప్రమేయం ఉన్నట్లు కధనాలు రాసి తన పరువుకి భంగం కలిగించారు అనేది ప్రధాన అభియోగం… అయితే ఈ కేసులో నూజివీడు కోర్టు సాక్షి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ భారతీరెడ్డి, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తికి విచారణకి హాజరు అవ్వాలి అని ఉత్తర్వులు జారీ చేసినా విచారణ కి హాజరు కాకపోవటం తో కోర్టు ధిక్కారణ కింద వీరిద్దరికీ నాన్ బెయిలబుల్ వారెంట్ ని జారీ చేసింది. మరి ఈ సమస్య నుంచి జగన్ సతీమణి ఎలా బయటపడుతారో చూడాలి.
