Friday, May 17, 2024
- Advertisement -

కాట‌మ‌రాయుడు క‌థ లో సూపర్ ట్విస్టులు ఇవే!

- Advertisement -
katmarayudu story leaked full twists in movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ఉగాదికి ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. గోపాల‌…గోపాల సినిమా దర్శకుడు డాలీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథ అజిత్ హీరోగా శివ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న వీర‌మ్ సినిమాకు రీమేక్‌గా వ‌స్తోందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. మూల‌క‌థ‌ను వీర‌మ్ నుంచే తీసుకున్నా తెలుగులో ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టుగా మార్పుల‌-చేర్పులు చేసిన‌ట్టు స‌మాచారం.

ఇక కాట‌మ‌రాయుడు సినిమా స్టోరీపై ఇండ‌స్ట్రీలో లీక్ అయిన స్టోరీ ప్ర‌కారం చూస్తే కాట‌మ‌రాయుడులో ప‌వ‌న్ ఓ మిడిల్ ఏజ్‌డ్ ఫ్యాక్ష‌నిస్టుగా క‌నిపించ‌నున్నాడు. ప‌వ‌న్ త‌మ్ముళ్ల కోసం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతాడు. ప‌వ‌న్ త‌మ్ముళ్లుగా కమల్ కామరాజు – విజయ్ దేవరకొండ – శివబాలాజీ – అజయ్ న‌టిస్తున్నారు. వీళ్ల‌ను ప్రేమించే అమ్మాయిలుగా కీచ‌క ఫేం యామిని భాస్క‌ర్‌, మ‌రో కొత్త అమ్మాయి మానస హిమవర్ష న‌టిస్తున్నారు.

ఇక సినిమాలో ప‌వ‌న్‌కు ఆడ‌వాళ్లంటే అస్స‌లు ప‌డ‌దు. వాళ్ల‌కు ఆమ‌డ దూరంలో ఉంటారు. ప‌వ‌న్ త‌మ్ముళ్లు మాత్రం ల‌వ్‌లో ప‌డిపోతారు. తమ్ముళ్లు తమ ప్రేమ కోసం అన్నను ప్రేమ‌లోకి దించే అమ్మాయి కోసం వెతికి…ఆమె ప్రేమ‌లో త‌మ అన్న‌ను దించుతారు. ఈ కథ మొత్తం రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుందట. చివరికి పవన్ తన తమ్ముళ్ల ప్రేమను, తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేది కాట‌మ‌రాయుడు కథ.

Related

  1. నాగబాబు, పవన్ ల గురించి నిజాలు చెప్పిన చిరు!
  2. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్
  3. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్!
  4. పవన్ ఫ్యాన్స్ పై చిరు ఫైర్.. ఎందుకో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -