Wednesday, May 15, 2024
- Advertisement -

మ‌రో బ‌యోపిక్‌లో కీర్తి సురేష్‌?

- Advertisement -

అల‌న‌టి న‌టి సావిత్రి జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రి పాత్ర‌ను హీరోయిన్ కీర్తీ సురేష్ పోషిస్తుంది.మొద‌ట ఈ సినిమాలో కీర్తి ఎంపిక‌పై చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.కాని సినిమా ఫ‌స్ట్ లుక్ చేశాక వారి అభిప్రాయం మార్చుకున్నారు.కీర్తి త‌న లుక్‌తో సావిత్రిగారిని దించేశార‌ని చిత్ర యూనిట్ అభిప్రాయం.ఈ సినిమా రేపు(బుధ‌వారం)రీలిజ్ కానుంది.ఈ సినిమా త‌రువాత మ‌రో క్రేజీ బ‌యోపిక్ ఆఫ‌ర్ కీర్తికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నారని వినికిడి. ఈ సినిమాకు కీర్తి అయితే బాగుంటుంద‌ని భావిస్తున్నారు చిత్ర యూనిట్‌.సినిమాల్లో ఓ వెలుగువెలిగి, తర్వాత తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించారు జయలలిత. ఒక దశలో రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు.ఈ బయోపిక్ కచ్చితంగా తమిళనాట ప్రకంపనలు సృష్టించడం ఖాయం.జయలలిత బయోపిక్‌లో చాల‌మంది ప్ర‌ముఖ‌లు గురించి కూడా ప్ర‌స్తావించాలి.

మరి ఇంతటి వివాదాస్పద బయోపిక్ లో కీర్తిసురేష్ నటిస్తుందా! అనేది డౌటే. పైగా తెలుగు త‌మిళ్ రెండు భాష‌ల‌లో కీర్తి బాగా ఫేమ‌స్‌.మార్కెట్ కూడా క‌లిసి వ‌స్తుంది.కాబ‌ట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకుంటున్నార‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -