ఓటుకు నోటు కేసు పురోగతిపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ఈ కేసుపై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి స్పందించారు. ఓటుకు నోటు కేసును నీరుగార్చవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ణప్తి చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు వాయిస్ కు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును ప్రజలకు వెల్లడించాలని కోరారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం దేశం మొత్తం తిరుగుతున్న కేసీఆర్… ఓటుకు నోటు కేసును పక్కన పెట్టే ప్రయత్నం చేయరాదని సూచించారు.
ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుపై కూడా విమర్శలు గుప్పించారు. ఉద్యోగ విధులను గాలికి వదిలేసి రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. అశోక్ బాబు కర్ణాటకకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని… దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందా? అని ప్రశ్నించారు. అతనిపై రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
