Saturday, May 4, 2024
- Advertisement -

పవన్‌కి నో చెప్పింది!

- Advertisement -

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా..? స్టార్ హీరోయిన్లు సైతం ఇతర మూవీలతో బిజీగా వున్నప్పటికీ పవన్ మూవీ కోసం ప్రత్యేకంగా డేట్స్ కేటాయిస్తారు. ఇక చిన్న హీరోయిన్లైతే ఎప్పుడెప్పుడు ఆయన సరసన నటించే అవకాశం వస్తుందా? అని క్యూలో వున్నారు. కానీ.. కీర్తిసురేష్ మాత్రం పవన్‌కి నో చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఎస్.జే.సూర్య, పవన్ కళ్యాణ్ కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో మొదట హీరోయిన్‌గా పార్వతీ మీనన్‌ను తీసుకోవాలని యూనిట్ అనుకుంది. ఇంతలోనే యూనిట్ నిర్ణయం మార్చుకుని.. కీర్తి సురేష్ అయితే బావుంటుందని భావించి ఆమెని సంప్రదించింది. అయితే.. అమ్మడు మాత్రం నటించడం కుదరదని తేల్చి చెప్పేసింది. దాంతో.. యూనిట్ ఒక్కసారిగా ఖంగుతింది. ఇందుకు గల కారణాలేంటని ఆరాతీయగా.. డేట్స్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టమని చెప్పిందట

తెలుగులో రామ్ తో ”నేను ….. శైలజ ” చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ భామ కు ఆ సినిమా సక్సెస్ తో బోలెడు ఆఫర్లు వస్తున్నాయి అయితే అన్నింటినీ ఒప్పుకోకుండా సెలెక్టివ్ గా చేస్తోంది. విజయ్ సినిమా చాన్స్ కూడా వచ్చిందట దాంతో పవన్ సినిమా ని పక్కన పెట్టి విజయ్ సినిమాకు డేట్స్ ఇచ్చిందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -