Friday, May 3, 2024
- Advertisement -

కెసిఆర్ సాధించింది ఏమీ లేదు

- Advertisement -

రెండేళ్ల పాలనలో తెలంగాణలో సాధించింది ఏమి లేదని, తెలంగాణ వచ్చింది ఒక లక్ష్యం కోసమైతే.. ఇక్కడ జరుగుతున్నది మరొకటని విద్యార్ధి సంఘాల నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు ఎద్దేవా చేశారు. బుధవారం రాత్రి హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విముక్తి పోరు గర్జన సభలో విద్యార్ధి సంఘాల నాయకులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, శాసనసభ మాజీ స్పీకర్, కాంగ్రెస్ నాయకుడు సురేష్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.

కొత్త రాష్ట్రం ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర రావు సాధించింది ఏమీ లేదని వారు విమర్శించారు. రాష్ట్రంలో యువకులు, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు చూపించాలని, ఆ ప్రయత్నం కూడా ఎక్కడా జరగడం లేదని వారు విమర్శించారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లను జారీ చేయాలని కాంగ్రెస్ నాయకుడు సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో 92 శాతం ఎస్సీ , ఎస్టీ, బిసీ, మైనార్టీలున్నారని, వారికి ఇస్తామన్న మూడెకరాల భూమిని ఎక్కడ పంచారని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు.

వివిధ జిల్లాల్లో ఎస్టీలు సాగు చేసుకుంటున్న పోడు భూమిని స్వాధీనం చేసుకుని వారిపై పిడీ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలు విద్యార్ధి సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరోవైపు టిటిడిపి నేత రేవంత్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ తెలంగాణ విద్యార్ధి జెఎసి హెచ్ఆర్ సిని ఆశ్రయించింది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -