Friday, May 10, 2024
- Advertisement -

కేథరిన్ ఆ పని.. కావాలని చేయలేదట..

- Advertisement -

అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన కేథరిన్.. ఆ రర్వాత అల్లు అర్జున్ కి జోడీగా రుద్రమదేవి సినిమాలో.. అలానే సరైనోడు సినిమాలో కూడా కనిపించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ అమ్మడు ప్రత్యేక పాత్రలు, ప్రత్యేక పాటలు తెగ చేస్తోంది.

రీసెంట్ గా రానా హీరోగా నటించిన నేనే రాజు.. నేనే మంత్రి సినిమాలో ఒక ముఖ్య పాత్ర్రను పోషించింది. ఆ పాత్రలో కేథరిన్.. ఎప్పుడు లేనింతా.. గ్లామర్ గా కనిపించింది. ఇక ఆ పాత్ర కోసం పొగరుపట్టి, కామంతో రగిలిపోయే అమ్మాయిగా ఆమెను దర్శకుడు చూపించడం జరిగింది. అటిట్యూడ్ కోసం ఆమెతో సిగరెట్ ను కూడా దర్శకుడు తాగించడం జరిగింది. రానాను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో, అతడిపై ప్రేమతో, అతడి ప్రేమను దక్కించుకునేందుకు రగిలిపోతూ విలన్స్ తో చేతులు కలిపి సినిమాకు హైలైట్ అయ్యింది.

తాజాగా తన పాత్ర గురించి కేథరిన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఈ పాత్ర తనకు బాగా నచ్చిందని, తనలోని నటిని చూపించే అవకాశం వచ్చిందని, అయితే ఈ పాత్ర కోసం సిగరెట్ తాగాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను అని, దర్శకుడు తేజ బలవంతం చేయడంతో, పాత్రకు తప్పదనే ఉద్దేశ్యంతో తాను సిగరెట్ ను తాగాను అంటు చెప్పుకొచ్చింది. మళ్లీ ఎప్పుడు సిగరెట్ తాగే పాత్రలు చేయను అని.. ఇక తనకు నిజ జీవితంలో సిగరెట్ తాగే అలవాటు లేదని క్లారి ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -