Friday, May 10, 2024
- Advertisement -

ముందు మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌…త‌ర్వాత ఒక్క‌రోజుకి కుదింపు..

- Advertisement -

నంద్యాల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ, టీడీపీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తున్నాయి. మిగిలిని రోజులు మ‌రింత ప్ర‌తీష్టాత్మ‌కంగా మారాయి. జ‌గ‌న్ అక్క‌డ‌నే ఉండి అంతా తానై న‌డిపిస్తున్నారు. కాని మాత్రం తూతూ మంత్రంగా రెండు సార్లు ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు క‌న్నెత్తికూడా చూడ‌టంలేదు. బాబు మూడురోజ‌ల ప‌ర్య‌ట‌న చేస్తార‌ని పార్టీ నాయ‌కులు చెప్పినా ఇప్పుడు మాత్రం ఒక్క‌రోజె ప‌ర్య‌ట‌న చేస్తార‌ని అన‌కూల మీడియా ప్ర‌చారం చేస్తోంది.మందు మూడు రోజుల ప‌ర్య‌ట‌న అన్న టీడీపీ ఇప్పుడ ఒక్క‌రోజుకు కుదించ‌డంపై అందిరిలోను ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

నంద్యాల ఉప పోరు షురూ అయ్యాకా చంద్రబాబు రెండు సార్లు పర్యటించారు. ఓట్లు వేయాలని అడగడంతో పాటు.. వేయాల్సిందే అని బెదిరించారు కూడా.నా రోడ్లపై నడుస్తున్నారు, నా పెన్షన్లు తింటున్నారు.. అంటూ బాబు వివాదాస్పద రీతిలో మాట్లాడాడు చంద్రబాబు. ఆ తర్వాత ముస్లింల ఓట్ల విషయంలో బాబు మాట్లాడిన తీరు. తనను నిలదీసిన వారిపై ఫైర్ అయిన తీరు.. ఇవన్నీ కూడా జాతీయ మీడియా వరకూ ఎక్కాయి. ఇనంద్యాల్లో చంద్రబాబు తదుపరి పర్యటన ఉండబోతోందని కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇప్ప‌టికె దాదాపు యాభై మంది నేతలను నంద్యాల బరిలోకి దించి.. ప్రచారం చేయించుకుంటున్న బాబు తను మూడో సారి అటు వైపు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అనుకూల మీడియా కథనం ప్రకారం.. నంద్యాల్లో చంద్రబాబు మరొక్క రోజు మాత్రమే పర్యటించనున్నారు.ఇంతకు ముందేమో 19తేదీ నుంచి 21వరకూ చంద్రబాబు నంద్యాల్లో మకాం పెట్టి.. ఆ మూడు రోజుల్లో మొత్తం వ్యవహారాన్ని మేనేజ్ చేసేస్తాడనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం.. మూడో దఫా పర్యటనలో మరో రోజే.. అనే మాట వినిపిస్తోంది.ఇవ‌న్నీ చూస్తుంటె నంద్యాల‌లో ప‌రిణామాలు అనుకూలంగా లేవ‌నె కార‌నంతోనె బాబు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -