కబీర్ సింగ్ లవర్ తో బాహుబలి డాన్స్

- Advertisement -

సాహో సినిమా షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ఆఖరి స్టేజ్ కి వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రభాస్, శ్రద్ధ కపూర్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా సుజీత్ దర్శకత్వం లో రానుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. అయితే ఈ సినిమా లో ఇప్పుడు ఐటెం సాంగ్ ఇంకా షూట్ చేయలేదట. చాలా రోజుల నుండి ఈ సాంగ్ కోసం ఎవరిని తీసుకోవాలా అని ఆలోచన చేసిన చిత్ర యూనిట్ ఫైనల్ గా ఇప్పుడు ఒక హీరోయిన్ ని తీసుకుందాం అని నిర్ణయించుకున్నారట.

ప్రస్తుతం అటు తెలుగు లో ఇటు హిందీ లో రాణిస్తూ అభిమానులని సొంతం చేసుకున్న కైరా అద్వానీ ని ఈ సినిమా లో ఐటెం సాంగ్ కి అప్రోచ్ అవ్వాలని అనుకుంటున్నారట చిత్ర యూనిట్. ఈ హీరోయిన్ అయితే బిజినెస్ పరం గా కూడా బాగుంటుంది అనేది వారి అభిప్రాయం. కైరా మంచి డాన్సర్ కూడా కాబట్టి కచ్చితం గా పాట విజయవంతం అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

ఇటీవలే కబీర్ సింగ్ సినిమా లో ప్రీతీ పాత్ర ని చేసిన కైరా ఒక వెబ్ సిరీస్ ని కూడా సైన్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -