Monday, May 13, 2024
- Advertisement -

ఇంపెల్జ్ – 2015 విజయవంతం కావడంపై వెల్లువెత్తిన హర్షాతిరేకాలు

- Advertisement -

ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు సాగిన ఇంపెల్జ్ – 2015 విజయవంతం కావడంపై హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. 2014 లో ప్రారంభం అయిన ఇంపెల్జ్ ఉత్వవం రెండో ఏడాదిలోనే ఊహించని స్థాయిలో  అన్ని వర్గాలను విశేషంగా ఆకర్షించిందని విద్యార్ధులు అభిప్రాయపడ్డారు.

ఇటువంటి కార్యక్రమాల వలన విద్యార్ధుల్లోని సృజనాత్మకత వెల్లడిఅవుతుందని.. వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తుందిని ఐఎంటి డైరక్టర్ డా.. సతీష్ ఐలవాడి అభిప్రాయపడ్డారు. వ్యాపార ప్రపంచానికి అవసరమైన మెరికల్లాంటి మేధావులను తయారుచేయటంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని సతీష్ అన్నారు.

బిజినెస్ స్కూల్స్ కేవలం విద్యాలయాల్లా మాత్రమే కాక విద్యార్ధులను మేధావులు గా మార్చే ప్రయోగశాలలుగా మారతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐఎంటి హైదరాబాద్ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించటంలో దేశంలోనే ప్రధమ స్థానంలో ఉంటుందని డా.. సతీష్ ఐలవాడి అభిప్రాయపడ్డారు.

“ఊహించండి.. సరి కొత్త ఆలోచనలు చేయండి..వాటిని చూసి ఉత్తేజం పొందండి” అనే నినాదంతో ప్రారంభం అయిన ఇంపెల్జ్ కార్యక్రమం దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూల్స్ నుంచి ఉహించిన దాని కంటే అద్భుతమైన స్పందన రావడం విశేషం.

ఐబిఎస్ హైదరాబాద్, ఐఐఎం కోజికోడ్, ఐటిఎం ఖర్గార్, ఎమ్ఐసిఏ అహ్మదాబాద్, ఐఎస్ బి, కెజే సోమయా, క్రిస్ట్ యూనివర్శిటి, ఎస్ఐఎంఎస్ పూనే ఇతర విద్యాసంస్థలనుంచి అధిక సంఖ్యలో విద్యార్ధులు పాల్గాన్నారని డా..సతీష్ వివరించారు.

ఇంపెల్జ్ ’15 లో భాగంగా నిర్వహించిన పిచ్-అప్, రిటోరిక్, సింతసిస్, యాడ్ ట్రాక్ట్, జాగృతి, మైసర్ అండ్ వైజర్, ప్రక్షేపణ్, లీడ్ హెచ్.ఆర్, ఆమ్య మరియు ముద్ర పోటీలు తమలో స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపాయని పోటీలో విజేతలైన విద్యార్ధులు పేర్కొన్నారు.  .  ఆర్ధిక, మార్కెటింగ్, మానవ వనరులు, ఆపరేషన్స్, వ్యూహాలు, సమాచార, సామాజిక, సంస్క్రతిక విభాగాల్లో నిర్వహించిన కార్యక్రమాలు తమ భవిషత్తుకు పునాదులు వేస్తాయన్న విశ్వాసాన్ని విద్యార్ధులు వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -