Sunday, April 28, 2024
- Advertisement -

దేవర..ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ కానుందా!

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దేవర. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుండగా ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ విలన్‌ పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 30వ సినిమా. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ పోస్టర్ భారీ అంచనాలను పెంచేసింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ అంటేనే డ్యాన్స్‌, డైలాగ్,ఫైట్స్. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడమే కాదు ఎన్టీఆర్ డైలాగ్‌లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారట. ఎన్టీఆర్ నుండి లాంగ్ లెంగ్త్ అండ్ పవర్ఫుల్ డైలాగ్స్ చూసి చాలా కాలం అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాతో అలాంటి డైలాగ్‌లను చేర్పించడం ద్వారా ప్లస్ అవుతుందని భావిస్తున్నారట దర్శకుడు కొరటాల.

అందుకే ఎన్టీఆర్ పాత్ర కోసం ప్రత్యేకంగా కొన్ని డైలాగ్స్ ని చాలా పవర్ ఫుల్ గా ఇంపాక్ట్ కలిగించేలా స్వయంగా రాశారట కొరటాల. ఇప్పుడీ వార్త టీ టౌన్‌లో హల్ చల్ చేస్తుండగా దేవరతో ఆచార్య ఫ్లాప్‌ను చెరిపేయాలని ప్రయత్నిస్తున్న కొరటాల శివ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -