Saturday, May 25, 2024
- Advertisement -

చంద్రబాబు ఎపిసోడ్..జగన్ సేఫ్..అంతా బీజేపీపైనే!

- Advertisement -

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌ వెనుకుంది ఎవరు…?బాబు జైల్లో ఉంటే లాభం ఎవరికి…?అసలు ఈ ఎపిసోడ్ మొత్తంతో లాభపడింది జగనేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాబు అరెస్ట్ వ్యూహాంతో ఇప్పుడు బీజేపీ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయే పరిస్థితి నెలకొంది.

వాస్తవానికి ఏపీ పాలిటిక్స్ టీడీపీ వర్సెస్ వైసీపీ, వైసీపీ వర్సెస్ జనసేనగా ఉండేవి. ఇక బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీని విమర్శించే ధైర్యం చేయలేదు ఎవరు. అయితే జగన్ విదేశాలకు వెళ్లడం తర్వాత చంద్రబాబు అరెస్ట్ , దీంతో జగన్ అనుకున్నంత పనిచేశారని ప్రజల్లోకి బాగా వెళ్లిపోయింది. వైసీపీ నేతలు జగన్‌తో పెట్టుకుంటే అంతేనని గొప్పలు చెప్పుకోగా టీడీపీ నేతలు జగన్ పేరు చెబితినే కారాలు, మిరియాలు నూరే పరిస్థితి నెలకొంది.

అయితే తాజాగా ఈ వ్యవహారంలో బీజేపీకే ఎక్కువ డ్యామేజ్ జరిగినట్లు తెలుస్తోంది. కేంద్ర బీజేపీ పెద్దల సహకారంతోనే బాబు అరెస్ట్ అయ్యారని లేటుగానైనా టీడీపీ నేతలకు, ప్రజలకు తెలిసొచ్చింది. ఎందుకంటే బాబు అరెస్ట్ తర్వాత బీజేపీ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇక బీజేపీ పెద్దలను కలిసేందుకు హస్తినకు వెళ్లిన లోకేష్‌కు నిరాశే మిగిలింది. ఆ తర్వాత చంద్రబాబుపై ఒక్క స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలోనే కాదు వివిధ రకాల స్కాంల పేరుతో 8 పీటీ వారెంట్లు దాఖలు చేసింది ఏపీ సీఐడీ. దీంతో ఒక కేసులో చంద్రబాబుకు బెయిల్ వచ్చినా మిగితా కేసుల్లో అరెస్ట్ కావడం ఖాయం. ఏ లెక్కన చూసుకున్న బాబు ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్ధితి లేదు.

ఈ వ్యవహారం అంతా కేంద్రం సహకారంతోనే జగన్ చేశారని..కేంద్రం మద్దతు లేకుంటే చంద్రబాబును జగన్ ఇంతలా ఇబ్బంది పెట్టేవారు కాదని టాక్ నడుస్తోంది. మోడీ, షా అనుమతితోనే ఇదంతా జరిగిందని అంతా బీజేపీపైనే నిందలు వేస్తున్నారు. దీంతో బాబు అరెస్ట్ వ్యవహారం జగన్‌కు చంద్రబాబుపై రీవెంజ్ తీసుకోవడానికి పనికొస్తే ..ఏం ఆశించి చేశారో తెలియదు కానీ బీజేపీ ఆలోచన మాత్రం బూమారాంగ్ అయిందని పలువురు భావిస్తున్నారు. టీడీపీ సానుభూతి పరులు, ప్రజలు సైతం జగన్‌ కంటే ఎక్కువ ఇప్పుడు బీజేపీనే నిందించే పరిస్థితి వచ్చింది. ఏపీలో తాజాగా నిర్వహించిన సర్వేలో ఇదే తేలింది. దీంతో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండగా జగన్‌ మాత్రం ఈ గేమ్‌లో సేఫ్ సైడ్ అయిపోనట్లేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -