Saturday, May 4, 2024
- Advertisement -

కల్లోల కమలం…జాకీ పెట్టి లేపినా!

- Advertisement -

బీజేపీ…ఈ పార్టీపై మొదటి నుండి ఉన్న అపదావు ఒక్కటే. ఉత్తరాది పార్టీ, నాయకులెక్కువా…క్యాడర్ తక్కువా. అందుకే ఆ పార్టీ ఏ ధర్నా చూసినా నాయకుల హడావిడే కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే తెలంగాణ బీజేపీకి తలనొప్పిగా మారింది. ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలతో బీజేపీ హౌస్‌ఫుల్‌గా మారింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు పదవుల కోసం నేతల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరుతో అటో ఇటో ఉన్న క్యాడర్ కూడా చెల్లాచెదురయ్యే పరిస్ధితి నెలకొంది.

బండి సంజయ్‌ తర్వాత పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో ఆ పార్టీకి ఉన్న విజయావకాశాలు సన్నగిల్లాయాని కమలపార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి. అందుకే అప్పటినుండి విజయశాంతి వంటి సీనియర్ నేతలు మౌనంగా ఉండిపోగా పలువురు పార్టీని సైతం వీడారు. దీనంతటికి కారణం కిషన్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్సేనని వెల్లడించారు కూడా.

కిషన్ రెడ్డి చెబితే కొంతమంది నేతలు వినలేని పరిస్థితి నెలకొనగా తన కోటరి నేతలకే ప్రాధాన్యం ఇస్తు ముందుకుసాగుతున్నారు. దీంతో పలు నియోజకవర్గాల్లో బీజేపీ నేతలపై క్యాడర్ సైతం అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇక రాజాసింగ్ అయితే పేరుకే బీజేపీ..ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియని పరిస్థితి. ఇక సీనియర్ నేతలెవరు పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డాక్టర్ లక్ష్మణ్ అడపదడపా స్టేట్‌మెంట్‌లు తప్ప క్యాడర్‌కు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది.

ఈటెల రాజేందర్ , రఘునందన్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వారికి ప్రాధాన్యత దక్కని పరిస్థితి. ఇక బీజేపీలో చేరినందుకు విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ పశ్చాత్తాప పడుతున్నారు. అలాగే పార్టీ సీనియర్ నేతలైనా న్యాయవాది రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధర్మపురి అరవింద్ పరిస్థితి సరాసరే. ఎవరి మాట వినని సీతయ్య. వెరసీ ఇబ్బందిపడుతుంది మాత్రం బీజేపీ కార్యకర్తలే.

అందుకే ఒకప్పుడు ఉన్న జోష్ ఆపార్టీలో లేదు. ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చి ఒకడుగెస్తే…10 అడుగులు వెనక్కిలాగుతున్న పరిస్థితి. ఏదిఏమైనా అధికారం కోసం కలలుగంటున్న తెలంగాణ బీజేపీ నేతల కలలు కల్లలుగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొందని ఆ పార్టీ కార్యకర్తలే వాపోతున్న పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -