Saturday, May 18, 2024
- Advertisement -

అదేనా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కథ!

- Advertisement -

ఎన్టీఅర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా ప్రస్తుతం కలక్షన్స్ వసుల్ చేస్తుంది. సినిమాకి మంచి పాజిటీవ్ టాక్ రావడంతో ఎన్టీఆర్, నాన్నకు ప్రేమతో టీం హ్యాపిగా ఉంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ 50 కోట్ల క్లాబ్‍లో చేరిపోతాడు అని సీనీ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఎన్టీఆర్ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టానున్నాడు.

మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు కొరటల శివతో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు. కొరటల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‍లో జనతా గ్యారేజ్ అనే సినిమా రాబోతుంది. ఐతే ఈ సినిమా కోసం దర్శకుడు మంచి పవర్ ఫుల్ కథ సిద్ధం చేసాడట. కొరటల శివ రచయితగా ఉన్నప్పుడు దర్శకుడు కావాలి అనుకుని ఓ కథ సిద్ధం చేసుకున్నడట.

దాదపు పది సంవంత్సరాల ముందు రాసుకున్న కథట. ఇప్పటి నేటివిటికి తగ్గట్లు కొన్ని మార్పులు చేసాడట. అంటే ఈ సినిమా కథ కొరటల శివ రాసుకున్న మొదటి కథ అంటే ఓ రెంజ్‍లో ఉంటుందని అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇక ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభించి ఆగస్ట్‌లో రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యమీనన్‍లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -