Sunday, May 12, 2024
- Advertisement -

వరుణ్ తేజ్.. ఓ సీక్రెట్ ఏజెంట్!

- Advertisement -

కంచెతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్.. డైరెక్టర్ క్రిష్ ఇంకో సినిమాకు రెడీ అయ్యారు. ఇన్నాళ్లూ రూమర్స్ గా ఉన్న ఈ ముచ్చట ఇప్పుడు కన్ఫమ్ అవుతోంది. స్క్రిప్ట్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉన్న క్రిష్.. వీలైనంత త్వరలోనే వరుణ్ తేజ్ తో మళ్లీ సినిమాకు ప్లాట్ ఫామ్ సెట్ చేస్తున్నాడు.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లోఫర్ మూవీ చేస్తున్న వరుణ్ తేజ్.. తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తి కాగానే… మళ్లీ క్రిష్ తో వరుణ్ రెండో సినిమా చేసే చాన్స్ ఉంది.

కంచెలో సెకండ్ వరల్డ్ వార్ కు సంబంధించి.. సైనికుడి పాత్రలో ఆకట్టుకున్న మెగా బ్రదర్ వారసుడు.. క్రిష్ తో చేస్తున్న రెండో సినిమాలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయనీ.. క్రిష్ ఫైనల్ స్క్రిప్ట్ నేరేట్ చేస్తున్నాడని వరుణ్ తేజ్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

మంచి ఫిజిక్.. అంతకు మించిన యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్.. క్రిష్ తో చేస్తున్న కొత్త సినిమాలో అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించే ఏజెంట్ గా కనిపించనున్నాడట. వరుణ్ ను దృష్టిలో పెట్టుకునే క్రిష్ ఈ క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. వీలైనంత త్వరలో ఫైనల్ స్క్రిప్ట్ ఫినిష్ చేసి సినిమాను పట్టాలెక్కించేందుకు క్రిష్ అండ్ వరుణ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -