Saturday, May 18, 2024
- Advertisement -

మోడీ తర్వాత వెంకయ్యే!

- Advertisement -

కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రా ప్రముఖుడు.. వెంకయ్యనాయుడు హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆ విషయం క్లియర్ అవుతోంది. రెగ్యులర్ గా ఫారిన్ టూర్లతో ఫుల్ బిజీగా ఉంటున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సభకు హాజరు కాలేని సమయంలో.. లోక్ సభతో పాటు.. రాజ్యసభలో కూడా బీజేపీకి వెంకయ్యనాయుడే అన్నీ అవుతున్నారు.

ఏ విషయం వచ్చినా.. ముందుండి పార్టీ సభ్యులను నడిపిస్తున్నారు.పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కూడా కావడంతో… సమావేశాల్లో ఆధిపత్యాన్ని ప్రూవ్ చేసుకుంటున్నారు.. వెంకయ్యనాయుడు. మాటల గారడీ చేసే విద్య కూడా తన సొంతం కావడంతో.. ఇటు దక్షిణాది ఎంపీలకు.. అటు ఉత్తరాది ఎంపీలకు తనదైన మాటతీరుతో జవాబు చెబుతూ సభను నడిపిస్తున్నారు.

దేశంలో పెరుగుతున్న అసహనంపై లోక్ సభలో జరిగిన చర్చలో కూడా పార్టీకి వెంకయ్య దిక్కుగా నిలిచారు.ఇష్టం వచ్చిన కామెంట్లు చేస్తూ.. పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్న సొంత ఎంపీలపైనా వెంకయ్య సీరియస్ అయ్యారట. ఎవరూ కాంట్రవర్సీ కామెంట్లు చేయొద్దని కాస్త గట్టిగానే చెప్పారట.

రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ లాంటి సీనియర్లకూ సాధ్యం కాని ఈ పనిని తన మీద వేసుకున్న వెంకయ్య.. పార్టీ ఎంపీలందరినీ లైన్ లో పెడుతున్నారట. ఇదంతా ఎలా అంటే.. డైరెక్ట్ గా ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్మిషన్ తోనే అని తెలుస్తోంది.

ఇలా మెల్లగా పార్టీతో పాటు.. ప్రభుత్వంలో పట్టు పెంచుకుంటున్న వెంకయ్యను చూసి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ టీడీపీ నాయకులతో పాటు కొందరు ప్రజలు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. వెంకయ్య డామినేషన్ రాష్ట్రానికి కచ్చితంగా మేలు చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -