Thursday, May 16, 2024
- Advertisement -

రాష్ట్రం కోసం ఆ మాత్రం చెయ్యలేరా ?

- Advertisement -

రాష్ట్ర విభజనతో తీవ్ర ఇబ్బందుల్లో రాష్ట్ర సర్కారు తో పాటు ఏపీ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతుంటే .. ఏపీ సచివాలయ ఉద్యోగులు మాత్రం త్యాగాలు చెయ్యడానికి సిద్దంగా లేము అంటున్నారు. విజయవాడ కి వచ్చిన ముఖ్యమంత్రి వారిని సచివాలయ ఉద్యోగులని జూన్ 1 2016 ల్లోగా విజయవాడ కి వచ్చేయ్యాల్ని అని కోరుతుండగా వారి వివిధరకాల డిమాండ్ లు రోజూ ఒకటి ఎత్తుతున్నారు.

తాము ఏమీ పెద్ద కొరికలు కోరడం లేదు అని అన్నీ తాము అడగదగ్గవే కోరుతున్నాం అనీ వారు అంటున్నారు. ఉద్యోగులతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఏపీ సర్కారు చెప్పినప్పటికీ.. తాజాగా తమను సంప్రదించకుండానే జీవో జారీ చేయటం పల్ల ఏపీ సచివాలయ ఉద్యోగులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక జీవో కూడా జూన్ 1 కల్లా బెజవాడ వచ్చెయ్యాలి అని విడుదల అయ్యిది దీంతో ఉద్యోగుల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. 

ప్రభుత్వం తమతో సంప్రదింపులు జరిపి డిమాండ్ లకి సానుకూలంగా స్పందించిన తరవాత మాత్రమే నిర్ణయం తీసుకుంటారు అనుకుంటే ప్రభుత్వం వారికి షాక్ ఇచ్చింది. జూన్ 1లోపు బెజవాడకు వచ్చేయాలంటూ ఏపీ సర్కారు జారీ చేసిన జీవో మీద ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అప్పుటూరి మురళీకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేసి కొత్త డిమాండ్లు తీసుకొచ్చారు.

రాష్ట్రము అంతా ఇబ్బందుల్లో ఉంటూ ఆర్ధికంగా చతికిల పడిపోయి ఉంటే వీరెంతో వీరి డిమాండ్లు ఏంటో అర్ధం కాని పరిస్థితి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -