Friday, April 26, 2024
- Advertisement -

మహేష్ హీరోయిన్ కి షారూఖ్ పక్కన చేసినా కోరిక తీరలేదు

- Advertisement -

తెలుగులో మ‌హేశ్‌బాబు.. హిందీలో షారుఖ్‌ప‌క్క‌న రెండే రెండు సినిమాలు చేసిన కృతిస‌న‌న్ మాంచి స్పీడులో ఉంది. ఈ మ‌ధ్య‌నే వ‌చ్చిన దిల్‌వాలేతో మాంచి కిక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇక నుంచి తాను ప‌క్కా టైం ప్ర‌కారం సినిమాలు చేస్తానంటోంది. త‌న ధ్యాసంతా.. కెరీర్‌మీద‌నే పెట్టానంటూ తెగ వ‌య్యారాలు పోతోంది.

పోటీలో ధీటుగా నిల‌బ‌డేందుకు కొత్త ఏడాది ప‌క్కా ప్లానింగ్ త‌న వ‌ద్ద రెడీగా ఉందంటూ య‌మా కాన్ఫిడెన్స్‌గా చెప్పేస్తోంది. అయితే ఒక్క లోటు మాత్రం ఇంకా భ‌ర్తీకాలేద‌ని.. అది తీర్చుకోవాల‌నే కోరిక కూడా ఉందంటోంది. ఇంత‌కీ ఆ కోరిక‌.. లోటు ఏంట‌నేగా మీ అనుమానం. ఇంకేముంది.. బాయ్‌ప్రెండ్ లేని లోటు మాత్రం కాస్త వేధిస్తోందంటోంది.. ఈ అందాలా న‌యాగార‌.

మ‌రి ఆ వేట‌లో ఏమైనా ఉన్నారా! అంటే.. అబ్బే అలాంటిదేమీ లేదు.. ఇప్పుడు నా ప‌నంతా.. సినిమాలేనంటోంది. కాస్త నిల‌దొక్కుకున్నాక‌.. న‌చ్చిన బాయ్‌ఫ్రెండ్ దొరికితే.. అప్ప‌టి వ‌రకూ ఉన్న లోటును తీర్చుకుంటుంది కాబోలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -