రూ. 251 లకే స్మార్ట్‌ ఫోన్!

- Advertisement -

కేవలం 251 రూపాయలకే స్మార్ట్‌ఫోన్ వస్తుందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం భారత్‌లోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ ఈ రోజు విడుదల కానుంది. రింగింగ్ బెల్స్ కంపెనీ గతంలో రూ. 500 కన్న తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తెస్తాం అని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు రూ. 251 లకే స్మార్ట్ ఫోన్ అందిస్తామని ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచింది.

నొయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు ఈ ఫోన్‍ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, బీజేపీ సీనియర్ ఎంపీ మురళీమనోహర్ జోషి న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. ఫ్రీడమ్ 251 పేరుతో ఈ ఫోన్‍ను రిలీజ్ చేయానున్నారు.

- Advertisement -

ఈ స్మార్ట్‌ఫోన్‍లో మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. నాలుగు అంగుళాలు డిస్‍ప్లే, 1 జీబీ వరకు రామ్, 8 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌, 32 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ, 3.2 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 0.3 మెగాపిక్సెల్, 1450mAh బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -