Sunday, April 28, 2024
- Advertisement -

సెట్స్‌మీద‌కు వెల్ల‌నున్న లక్ష్మీస్ వీరగ్రంధం…

- Advertisement -

ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా మూడు సినిమాలు తెర‌కెక్క‌నున్నాయి. ఇప్ప‌టికె ఈమూడు సినిమాలు పాపులారిటీని సంపాదించాయి. ఈమూడు సినిమాల్లో న‌టించె క్యారెక్ట‌లు ఎవ‌ర‌నేది స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. తెర‌కెక్క‌నున్న మూడు బ‌యోపిక్‌ల చిత్రాల‌లో ఒకట‌యిన లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాలో ల‌క్ష్మిపార్వ‌తి క్యారెక్ట‌ర్ ఎవ‌ర‌నేది తేలిపోయింది.

చిరంజీవి న‌టించిన ఖైదీ150 సినిమాలో రత్తాలు.. రత్తాలు సాంగ్ తో ఓ ఊపుఊపిన రాయ్ లక్ష్మీ ఇప్పుడు గుర్తుందాబాలీవుడ్ లో జూలీ-2 ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఇప్పుడీ బ్యూటీ తెలుగులో ఓ బయోపిక్ లో నటించనుంది. అనుకున్నట్టు జరిగితే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాలో కీలకమైన లక్ష్మీపార్వతి పాత్రలో లక్ష్మీరాయ్ కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

సినిమాలో న‌టించ‌డానికి లక్ష్మీరాయ్ ను సంప్రదించినట్టు ఈ సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్వయంగా ప్రకటించారు. రాయ్ లక్ష్మితో పాటు వాణి విశ్వనాథ్ ను కూడా సంప్రదించామని.. వీళ్లలో ఎవరు లీడ్ రోల్ చేస్తారో రేపు క్లారిటి రానుంది. ఈ సినిమా రేపట్నుంచే సెట్స్ పైకి వెల్ల‌నుంది. ఎన్టీఆర్ గార్డెన్స్ లో ఉదయం 11.30నుంచి 12.30మధ్య ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. జయం మూవీస్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు ఆదర్శ గృహిణి అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు.

ఇప్ప‌టికె ఎన్టీఆర్ జీవితంపై బాలయ్య-తేజ కాంబోలో ఒక సినిమా, వర్మ దర్శకత్వంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే మరో సినిమా రాబోతున్నాయి. ఈ రెండింటికంటే ముందే ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ ప్రారంభంకాబోతోంది. ఈమూడు చిత్రాల‌లో ఏది ముందువ‌రుస‌లో నిలుస్తాదో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -