Tuesday, May 21, 2024
- Advertisement -

” హీరోల పెళ్ళాలూ, వాళ్ళ అఫైర్ లూ “ఇదీ సినిమా

- Advertisement -

బాలీవుడ్ లో కాస్తంత బోల్డ్ సబ్జెక్ట్ లు తీసుకుని వాటి మీద ఎక్స్ పరిమేంట్ లు చెయ్యడం అంటే అది ఒక్క మధూ బండార్కర్ కే చెల్లింది. సినిమా మొత్తం ఎక్కడ నుంచో తీసుకుని సెట్స్ లో షూటింగ్ తీసి హిట్ కొడుతూ ఉంటారు డైరెక్టర్ లు కానీ మధూ మాత్రం సెట్స్ మీదనే స్క్రిప్ట్ రాసి సెట్స్ లో జరిగే విషయాలు తన సినిమాలో చూపిస్తూ ఉంటాడు.

తన సినిమాలైన ఫ్యాషన్ , హీరోయిన్ అన్నీ ఇలాంటి కోవకి చెందినవే.  ఆఫ్ స్క్రీన్ లో జరిగే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి సినిమాలు తీస్తూ ఎప్పుడు వివాదాల్లోనే ఉంటాడు! అయినా కూడా అలాంటి సబ్జెక్ట్ లను వదలని మాదూర్.. మళ్ళీ అలాంటి సినిమానే తీస్తాను అని చెప్పుకొస్తున్నాడు.

ఇప్పుడు సరికొత్త సినిమాగా ఒక అడుగు ముందుకు వేసి “హీరోల పెళ్ళాల” మీద సినిమా తీస్తా అంటున్నాడు. స్టార్ హీరోలు ఎలా ఉంటారో అందరికీ తెలుసు కాని వారి భార్యలు ఎలా ఉంటారు? భర్తలు షూటింగ్స్ సమయంలో హీరోలు, హీరోయిన్లతో క్లోజ్ గా ఉంటే వీరి మనోవేదన ఎలా ఉంటుంది? హీరోల భార్యలు వేరే హీరోలతో ఎలా అఫైర్ లు పెట్టుకుంటారు ఇలాంటి సినిమా తీస్తాడట. ఇది ఎంతటి వివాదాస్పదమవుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -