Monday, May 13, 2024
- Advertisement -

మహేష్ – పవన్ కళ్యాణ్ లు అక్కినేని హీరో ని చూసి నేర్చుకోండి

- Advertisement -

వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు హీరో నాగ చైతన్య. కెరీర్ లో ఏ మాత్రం గ్యాప్ రాకుండా చూసుకుంటూ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డాడు అతను. పెళ్ళికి ముందే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చెయ్యాలి అనేది అతని ఆలోచన కావచ్చు.

ప్రస్తుతం మలయాళం సూపర్ హిట్ ప్రేమం సినిమా రిమేక్ లో నటిస్తున్న చైతన్య ఈ మధ్యనే గౌతం మీనన్ తో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా పూర్తి చేసాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఏం మాయ చేసావే సినిమా’ సూపర్ హట్ అయిన విషయం తెలిసిందే. సాహసం .. సినిమా షూటింగ్ పూర్తైన కేవలం మూడు రోజుల గ్యాప్ లో నాగ చైతన్య మళ్ళీ కొత్త సినిమా మొదలేట్టెసాడు.

సినిమా సినిమా కీ కనీసం రెండు నెలలు గ్యాప్ తీసుకుంటున్న హీరోలు ఉన్న ఈ రోజుల్లో చైతన్య ఈ సాహసం ఏంటో తెలియడం లేదు. నవంబర్ 30న లాంచ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో శృతి హాసన్ కూడా పాల్గొంటోంది.శృతి హాసన్ తో పాటు, అనుపమ పరమేశ్వరన్ ని కూడా మరో హీరోయిన్ గా సెలక్ట్ చేసారు మూడవ హీరోయిన్ గా చిరుత ఫేం నేహా శర్మ చెల్లెలు ఇషా శర్మ అని అనుకున్నారు కానీ ఇప్పుడు అదే స్థానం లో రజీనా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఏదేమైనా ఇలా వరసగా సినిమాలు చేస్తూ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా పెద్ద హీరోలు తనని చూసి నేర్చుకోవాలని అనేలా చేస్తున్నాడు చైతన్య. పవన్ కళ్యాణ్ రెండేళ్ళకి ఒక సినిమా మహేష్ రెండేళ్ళకి మూడు సినిమాలు చేస్తుంటే అదే తరానికి చెందిన చైతన్య ఇలా వరసగా చేయ్యగాలుగుతున్నాడు అంటే వారికీ సాధ్యమేగా. మార్కెట్ లలో తేడా ఉండచ్చు కానీ అందరికీ లభించే సమయంలో తేడా ఉండదు గా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -