Friday, May 3, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎప్పడు నేర్చుకుంటారు

- Advertisement -

హాలీవుడ్ నుంచీ బాలీవుడ్ దాకా అభిమానులు అందరికీ ఉంటారు. సౌత్ ఇండియా లో అభిమానుల పాళ్ళు కాస్త ఎక్కువ . ముఖ్యంగా రజినీకాంత్ హయాం నుంచీ మొదలైంది ఈ ఓవర్ అభిమానం .హీరోలని దేవుళ్ళు గా కొలవడం వారిని నెత్తిన పెట్టుకోవడం లాంటివి చాలా నే జరుగుతూ ఉంటాయి మనకి కొత్తేం కాదు.

కానీ ఈ మధ్య కాలం లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ అంటూ కొందరు చూపిస్తున్న అత్యుత్సాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.”పవర్ స్టార్ పవర్ స్టార్” అంటూ ఆడియో ఫంక్షన్ లలో అరవడం జనాలని విసిగించడం మాట్లాడనివ్వక పోవడమే వారు పనిగా పెట్టుకుంటున్నారు. పవన్ ఫాన్స్ ఇలా చేస్తున్నారా లేక పవన్ ఫాన్స్ అంటూ చెప్పుకునే వారు చేస్తున్నారా అనేది తెలీదు కానీ స్టేజీ ఎక్కిన ప్రతీ సెలెబ్రిటీ నీ అరిచి గోల చేసి తాను పవన్ ఫాన్స్ అని అనిపించే దాకా వదలడం లేదు.

నిన్నటికి నిన్న లోఫర్ ఆడియో వేడుక లో ఇలాంటి తలనొప్పి వ్యవహారం బయటపడింది. ఈ ఆడియో లాంచ్ కి ప్రత్యేక అతిధి గా వచ్చిన ప్రభాస్ కి చుక్కలు చూపించారు పవన్ అభిమానులు. అతను స్టేజీ ఎక్కి మైక్ పట్టుకున్న దగ్గర నుంచీ ‘పవర్ స్టార్ పవర్ స్టార్’ అంటూ గోల గోల చేసి విసుగేత్తించారు. సినిమా విషయాలు మాట్లాడనివ్వకుండా అరుస్తూనే ఉన్నారు.

ఈ విషయంలో విశ్లేషకులు ఫాన్స్ ని తప్పు బడుతున్నారు. అలా అరవడం క్రేజ్ అనుకుంటే అది వారి మూర్ఖత్వం అవుతుంది అని ఇలాంటివి పవన్ కళ్యాణ్ కూడా ససేమిరా అంగీకరించడు అని అంటున్నారు వాళ్ళు. పవన్ ఫాన్స్ నిజంగా ఆయన అంటే ఇష్టం ఉన్నవారు ఇష్టం అని చెబితే సంతోషించాలి కానీ పవన్ ఫాన్ ని నేను అని చెప్పేదాకా వదలకపోతే ఎలా అంటున్నారు .. నిజమేగా అభిమానం బలవంతం మీద వస్తుందా ? ప్రేమ వల్ల వస్తుందా ? 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -