- Advertisement -

రాజ్య‌స‌భ‌ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక‌ల్లో ఎన్డీఏకు వ్య‌తిరేకంగా ఓటు వేస్తాం…

- Advertisement -

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పదవికోసం జరగనున్న ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. నువ్వానేనా అన్నట్లుగా ఈ పోరు జరిగనుంది. అధికార పార్టీ బీజేపీకి పెద్దల సభలో సరైన సంఖ్యా బలం లేకపోవడంతో వారు ఇప్పటికే అన్ని రకాల మార్గాలు వెతుకుతున్నారు. ఇదే క్ర‌మంలో ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తుకోసం భాజాపా పావులు క‌దుపుతోంది. భాజాపా మ‌త్ర‌ప‌క్షం జేడీయూ అభ్య‌ర్తిని త‌మ అభ్య‌ర్తిగా ప్ర‌క‌టించింది.

రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక‌లో ఏపీలోని పార్టీలు కూడా కీల‌కం కానున్నాయి. గ‌తంలో రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు మ‌ద్ద‌తు తెలిపిన వైసీపీ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక‌లో మాత్రం ఎన్డీఏకు గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఈనెల 9 న‌జ‌రిగే ఓటింగ్‌లో ఎన్డీఏ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై వైసీపీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వంచనకు నిరసనగా ఎన్ డీఏ లేదా బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైసీపీ నిర్ణయించింది. ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయనందుకే తమ పార్టీ ఎన్డీఏ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -