ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నారు. పవన్ ప్రస్తుతం సినిమా సక్సెస్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి అంటూ మూవీస్ చేసుకుంటూ వేళ్తున్నారు. తాజాగా ‘కాటమరాయుడు’ చిత్రాన్ని పూర్తి చేసి ఈనెల 24న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న పవన్ ఆ తర్వాత నాలుగు సినిమాలకు ఇప్పటికే కమిట్ అయ్యాడు. ‘కాటమరాయుడు’ విడుదల అవ్వడమే ఆలస్యం వచ్చే నెలలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.
దాంతో పాటే తమిళ దర్శకుడు నేషన్ దర్శకత్వంలో వేదాళం చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు చిత్రాలు కూడా చేసే అవకాశాలున్నాయి. పవన్ ఇప్పటికే సంతోష్ శ్రీనివాస్‌కు ఓకే చెప్పాడు, అలాగే తమిళంలో సక్సెస్ అయిన తెరి చిత్రాన్ని కూడా తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్దం అవుతున్నాడు.
ఇలా పవన్ వరుసగా చిత్రాలు చేస్తుంటే మహేష్‌బాబులో ఆందోళన పెరిగి పోతున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్‌తో పోల్చితే గతంలో మహేష్‌బాబు కాస్త అధిక సంఖ్యలో సినిమాు చేసేవాడు. దాంతో తెలుగు యువ హీరోల్లో నెం.1 స్థానంలో మహేష్‌బాబు ఉండేవారు. అయితే పవన్ వరుసగా సినిమాలు చేస్తుండటంతో పవన్ కళ్యాణ్‌కు ఆ స్థానం దక్కుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు. అందుకే మహేష్‌బాబుకు కాస్త టెన్షన్ గా అనిపిస్తోందట.
{youtube}LG-OAFLLGsE{/youtube}
Related