Wednesday, May 8, 2024
- Advertisement -

పవన్ బరిలోకి దిగితే ఎవరికి లాభం..?

- Advertisement -
who is won in 2019 elections

2019 ఎన్నికల్లో వైసిపీ.. టీడీపీ… జనసేన పార్టీలు బరిలోకి దిగబోతున్నాయా. 2019 లో జనసేన పార్టీ తరుపున పోటీ పాల్గొంటే.. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం ఎవరికి లాభం.. ఎవరికి నష్టం. 2014 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, వైసిపీ పార్టీలు మాత్రమే బరిలోకి దిగాయి. అయితే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీని అప్పటికి అరంభించినా.. ఎన్నికల బరిలోకి దిగలేదు.

అయితే టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. దాంతో ఆ పార్టీకి కావాల్సినంత పబ్లిసిటీ తో పాటు ప్రజల ఓట్లు సైతం టీడీపి వైపు మొగ్గు చూపాయి. ఎక్కువ శాతం ఓట్లతో కాకుండా అతి స్వల్ప ఓట్ల శాతంతో అధికారంను దక్కించుకుంది టీడీపి. ఒకవేళ.. 2019 లో డైరెక్ట్ గా జనసేన పార్టీ బరిలోకి దిగి.. అన్ని నియజకవర్గాలల్లో పాల్గొంటే.. ఓటర్లు మొగ్గు ఎలా ఉండబోతుంది..? ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం జనసేన అభ్యర్ధులు పోటీలో పాల్గొంటే.. టీడీపీ ఓటర్లు చీలిక ఏర్పడే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది.

ఇలా జరిగితే.. వైఎస్‍ఆర్‍సిపి ఓటర్లు తట్టస్థంగా ఉండి..టీడీపీ ఓట్లు చీలటం వల్ల వైసిపీకే పట్టం కట్టే అవకాశం ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది ఏమైన 2014 ఎన్నికల్లో టీడీపీకి.. పవన్ కళ్యాన్ మద్దతు ఇవ్వడం వల్లే అధికారం వచ్చినట్లు టాక్ ఉంది. ఈ సారి మూడూ పార్టీలు వేరు వేరుగా ఎన్నికల బరిలో దిగడంతో ఖచ్చితంగా టీడీపీకి అధికారం దక్కే అవకాశం లేదు అంటున్నారు. ఇక జగన్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే ప్రజలకు చంద్రబాబు చేస్తున్న ద్రోహం ఏంటో అర్ధం అయింది.. రాబోయే ఎన్నికల్లో మాదే అధికారం.. ప్రజలు కూడా వైసిపీ వైపు మొగ్గు చూపుస్తున్నారని అంటున్నారు. మరి ఎవరి రిజల్ట్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే 2019 ఎన్నికల్లో వరకు ఆగాల్సిందే.

{youtube}YehZ6F_aozQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -