సూపర్ స్టార్ మహేశ్ బాబు మళ్లీ కౌబాయ్ గా కనిపించబోతున్నాడా ? అప్పడెప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో టక్కరి దొంగగా కనిపించిన మహేశ్…ఇన్నాళ్లు మరోసారి ఆ వేషం కట్టబోతున్నాడా ? ఫిల్మ్ సర్కిల్స్ లో ఇప్పడిదే వార్త చక్కర్లు కొడుతోంది. అప్పట్లో టక్కరి దొంగ అంత ఆశించిన హిట్ కాలేదు. అందుకేనేమో .. కౌబాయ్ గెటప్ లో హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నట్లు ఉన్నాడు మహేశ్ బాబు.
రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని మార్చ్ 25న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను తిరిగి మొదలు పెట్టారు జక్కన్న అండ్ టీమ్. ఈ సినిమా విడుదలవకుండానే.. మహేశ్ తో చేయబోయే సినిమాకి స్ర్కిప్ట్ వర్క్ స్టార్ట్ చేయమని తండ్రి విజయేంద్రప్రసాద్ కు చెప్పారట రాజమౌళి. ప్రస్తుతం ఆయన సినిమా స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారట. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ట్రెజర్ హంట్ కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమా మొత్తం కౌబాయ్ జోనర్ లో లేకపోయినా.. మహేశ్ గెటప్ మాత్రం కౌబాయ్ ను పోలి ఉంటుందని సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘సర్కారువారి పాట’ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమా చేయబోతున్నాడు మహేశ్. ఈ ఏడాది చివరతో ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుంది. ఆ తర్వాత రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. మరి కౌబాయ్ గెటప్ లో మహేశ్ బాబు ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.
కంగారుపడుతున్న రవితేజ ఫ్యాన్స్