Friday, April 19, 2024
- Advertisement -

కంగారుపడుతున్న రవితేజ ఫ్యాన్స్

- Advertisement -

మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ సినిమా తర్వాత మంచి ఊపు మీద ఉన్నాడు. క్రాక్‌కు ముందు విడుదలైన రవితేజ చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేపోయాయి. మాస్ మహారాజ్‌ కెరీర్‌కు బూస్ట్ ఇచ్చిన చిత్రం క్రాక్. ఇప్పుడు అదే సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఖిలాడి విడుదల న్యూస్..బయటకొచ్చింది. రవితేజ అప్‌కమింగ్ సినిమా ‘ఖిలాడి’ ఫిబ్రవరి 11న విడుదల తేదీని ఖరారు చేసుకుంది.

తమ హీరో నటించిన సినిమా విడుదల తేదీ ప్రకటిస్తే.. అభిమానులకు పండుగలాగ ఉంటుంది. కానీ ఖిలాడి విడుదల తేదీ చూస్తే మాత్రం.. రవితేజ ఫ్యాన్స్ కాస్త ఖంగారు పడుతున్నారు. రవితేజ కెరీర్‌లో ఫిబ్రవరిలో వచ్చి హిట్ కొట్టిన ఒక్క సినిమా కూడా లేదు. ముందుగా 2006లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటించిన ‘షాక్’ సినిమా ఫిబ్రవరి నెలలోనే విడుదలయ్యింది. అది కమర్షియల్‌గా అంత సక్సెస్ సాధించలేకపోయింది.

2012లో ‘నిప్పు’, 2018లో ‘టచ్ చేసి చూడు’ సినిమాలు కూడా ఫిబ్రవరిలోనే విడుదలయ్యి ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇప్పుడు ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఖిలాడి కూడా ఫిబ్రవరిలోనే విడుదవుతుండటం మాస్ మహారాజ్ ఫ్యాన్స్‌ను ఖంగారు పెడుతోంది. మరి ముందు సినిమాలలాగా సెంటిమెంట్‌తో ఖిలాడి కూడా కమర్షియల్‌గా వెనకబడుతుందో లేదా ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి విజయాన్ని సాధిస్తుందో చూడాలి మరి..

బూమరాంగ్ అయిన రాహుల్ రామకృష్ణ ట్వీట్

మళ్లీ జతకడుతున్న మనం జోడీ

మొదటి ఇంటిని అమ్మేసిన బిగ్‌ బీ.. ధర తెలిస్తే షాకే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -