Thursday, May 16, 2024
- Advertisement -

బాహుబలికి గట్టి పోటీ ఇవ్వబోతున్న మహేష్!

- Advertisement -

వచ్చే ఏడాది మన హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ పడనున్నారు. సంక్రాంతి రేసులో చిరు, బాలకృష్ణ, నాగ్ లు పోటీ పడుతుంటే వేసవిలో మాత్రం బాహుబలికి గట్టి పోటీ ఇచ్చి నెంబర్ వన్ ప్లేస్ లో ఉండాలి అని మహేష్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఓ సోషల్ మెసేజ్ నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన పరణీతి చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. జూలైలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు దర్శకుడు రాజమౌళి కూడా ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ‘క్లైమాక్స్ పార్ట్’ షూట్ చేస్తున్నారు.

‘బాహుబలి’, మహేష్ సినిమా కేవలం 2 వారాల గ్యాప్‌తో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ రెండు చిత్రాల్లు అన్నుకున్న టైంకి రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ ఉండటం ఖాయమని సినీ పండితులు అంటున్నారు. నిజానికి మహేష్ ‘శ్రీమంతుడు’, ‘బాహుబలి: ది బిగినింగ్’ మధ్య పోటీ గతంలో ఉండాల్సింది. ఒకే సారి రెండు భారీ సినిమాలు రిలీజ్ చేస్తే రెండింటికీ నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ‘శ్రీమంతుడు’ యూనిట్ తమ సినిమాని పోస్ట్‌పోన్ చేసింది. ఇప్పుడు మరో సారి తమ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు భారీ హిట్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ వసులు చేసి నెంబర్ వన్ గా నిలుస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -