త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్,బీఆర్ఎస్,బీజేపీ సిద్ధమవుతున్నాయి. ఇక కాంగ్రెస్ ప్రధానంగా 14 స్థానాలు గెలుస్తామని చెబుతుండగా బీఆర్ఎస్, బీజేపీ సైతం మెజార్టీ స్థానాలు తమవేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే రీసెంట్‌గా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి పేరు మార్మోగిపోయింది. ఆమె బర్రెలక్క అలియాస్ శిరీష.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేశారు బర్రెలక్క. ఎంత ఒత్తిడి వచ్చినా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక ఆమె తమ్ముడిపై దాడి జరగడంతో ఆమె మరింత సెన్సేషన్‌గా మారగా దాదాపు 6 వేల ఓట్లు సంపాదించింది. అయితే ఓడిపోయినా సత్తా చాటింది బర్రెలక్క. ఇక తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది బర్రెలక్క.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. నాగర్ కర్నూలు స్ధానం నుండి పోటీ చేస్తానని తేల్చి చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేర్పిన అనుభవంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపింది. సోషల్ మీడియాలో బర్రెలక్కకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. జేడీ లక్ష్మీ నారాయణ వంటి వారు కూడా బర్రెలక్కకి సపోర్ట్ చేశారు. ఇక తాజాగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించగా బర్రెలక్క ఎంత సంచలనం సృష్టిస్తుందో వేచిచూడాలి.
