Monday, May 6, 2024
- Advertisement -

రోజాకి షాక్ ఇచ్చిన మహేష్

- Advertisement -

మహేష్ తాజా సినిమా స్పైడర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రిత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విలన్ గా దర్శకుడు.. నటుడు.. ఎస్ జే సూర్య నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. ముందు నుంచి అయిన ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. సెన్సార్ ప్రకారం ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని సెన్సార్ సభ్యులు చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే మహేష్ బిజీ బిజీగా ఈ స్పైడర్ సినిమాని ప్రమోషన్ చేస్తున్నాడు. నిమిషం ఖాళీ లేకుండా ప్రచారం జోరుగా చేస్తున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తమిళంలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తెలుగు ప్రమోషన్ లో భాగంగా ఇటివలే ఓ చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో మహేష్ ని ఇంటర్వ్యూ చేసింది ఎమ్మెల్యే రోజా. ఈమే చిరు ఖైదీ 150 సినిమాకి చిరుని ఇంటర్వ్యూ చేయగా.. మళ్లీ ఇప్పుడు మహేష్ బాబుని ఇంటర్వ్యూ చేసింది.

ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబుని.. రోజా సినిమా సంబంధించిన చాలా ప్రశ్నలు అడిగింది. అందుకు మహేష్ మంచి సమాధానలు చెప్పాడు. చివర్లో మహేష్ కూడా రోజా షాక్ ఇచ్చేలా.. మీరు సినిమాలు.. ఇంటర్వ్యూ చేస్తారా.. రాజకీయాల్లో ఉంటారా అని అడగటంతో.. అందుకు రోజా.. లేదు లేదు.. ఖైదీ 150 కోసం చిరుని ఇంటర్వ్యూ చేశాను.. తర్వాత మీమ్ములనే ఇంటర్వ్యూ చేశా.. రాజకీయ పరంగా తాను చాలా బిజీ అని చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -