Saturday, April 27, 2024
- Advertisement -

2019 ఎన్నిక‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్తు వీళ్లేనా….

- Advertisement -

2019 ఎన్నిక‌లు కురుక్షేత్ర మ‌హా సంగ్రామాన్ని త‌ల‌పించ‌నున్నాయి. అన్ని పార్టీలు ఇప్ప‌టికె త‌మ వ్యూహాలు అమ‌లు చేసె ప‌నిలో ఉన్నారు. ఇయితే ఇప్పుడు ఎవ‌రూ ఊహించ‌ని కొత్త ప‌రిణామాలు చోటు చేసుకోబోతున్నాయ‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. మాస్ ఫాలోయింగ్ ఉన్న ఆ ఇద్ద‌రు క‌లిసి వ‌చ్చె సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు వెల్తే ఉహించ‌డం క‌ష్ట‌మె.

ప్రస్థుతం తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్టార్ హీరోలు. జై లవకుశ సినిమాతో ఎన్టీఆర్ తన సత్తా ఏంటో మరో సారి అందరికి పరిచయం చూపించాడు. ఎన్టీఆర్ అంటే తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడుగా ప్రతి ఒక్కరు గుర్తించే స్థాయిలో ఉన్నాడు.

నటుడిగా పవన్ కళ్యాణ్ అంతగా గుర్తింపు తెచ్చుకోకపోయిన ఆయన చరిస్మాతో సౌత్ ఇండియాలో రజినీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ వున్న వాడిగా నిరూపించుకున్న వ్యక్తి. తన వ్యవహారశైలితో కారణంగా గౌరవం సంపాదించుకున్నారు. ఇద్ద‌రు నేత‌ల‌కు మాస్ ఫాలోయింగ్ భ‌యంక‌రంగా ఉంది.

పవన్, ఎన్టీఆర్ లకు ఇద్దరికి వెనుక పెద్ద ఫామిలీస్ ఉన్నాయి. అయితే వారికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో ఈ ఇద్దరి మార్గాలు చాలా దగ్గరగా ఉంటాయి. వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి, స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడానికి వ్యక్తిగతంగా వారిని వారు తీర్చిదిద్దుకున్నారు .

అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాల గురించి చర్చకు వచ్చినప్పుడు అందరు చెప్పే మాట పవన్ కళ్యాణ్, తారక్ ఇద్దరికి భవిష్యత్తులో తెలుగు ప్రజలకి నాయకులుగా ఉండే లక్షణాలు ఉన్నాయని సర్వత్రా వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తాత నాయకత్వ లక్షణాలని కూడా పునికిపుచ్చుకున్నాడని, అతనికి ప్రజల సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉందని, కచ్చితంగా రేపటి టీడీపీ భవిష్యత్తు ఎన్టీఆర్ తోనే సాధ్యం అనే మాట స్పష్టంగా వినిపిస్తుంది.

ప్ర‌స్తుతం తెలుగు ప్రజల్లో మాత్రం ఒక అభిప్రాయం ఉంది తెలుగు నాట పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పార్టీల పరంగా కాకున్నా, ఒకే ఆలోచనతో ఉన్న నాయకులు కాబట్టి వారు రాజకీయాల్లో ఉంటే ఏపీ దేశంలో రాజకేయాలని శాశించే రాష్ట్రం అవుతుందని, అలాగే మిగిలిన రాష్ట్రాలకి కూడా ఏపీ ఆదర్శం అవుతుందని చాలా మంది విశ్వసిస్తున్నారు.

చంద్ర‌బాబు హ‌రికృష్న‌ఫ్యామిలీని దూరంగా పెట్టార‌న్న సంగ‌తి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో అవగాహ కుదుర్చుకుంటే రాజ‌కీయ భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని హ‌రికృష్న ఆలోచిస్తున్నారంట‌. వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ఇప్పుడు అన్నా టీడీపీని పున‌రుద్ద‌రించి పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటే.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు తమవైపుకే మళ్లుతాయని హరికృష్ణ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్ద‌రు క‌ల‌సి ఎన్నిల‌కు వెల్తే ఇత‌ర పార్టీలు బంగాళా ఖాతంలో క‌ల‌వాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -