Sunday, June 16, 2024
- Advertisement -

అద్గ‌దీ సంగ‌తి…..

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌ల పెట్టిన అన్న‌వ‌స్తున్నాడు పాద‌యాత్ర దాదాపు వాయిదా ప‌డింద‌నె చెప్పాలి. వాయిదా వెనుక కారణం ఏముంట‌నేది పార్టీలోను, అధికార‌పార్టీలోను పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. అయితె ఇప్పుడు స‌డ‌న్‌గా పాద‌యాత్ర‌ను నవంబర్ మొదటి వారంలో పాదయాత్ర ప్రారంభించేందుకు వైసిపి సిద్ధమవుతోంది.

ఎన్నికలు మరో ఏడాదిన్నర మాత్రమే ఉన్నందున పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లాలనే ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి, ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగన్ అదే దారిని ఎంచుకున్నారు.

అయితె ఇప్పుడు దీని వెనుక ర‌క‌క‌రాల కార‌నాలు వినిపిస్తున్న‌ప్ప‌టికి అస‌లు కార‌నాలు వేరె ఉండాయ‌నెది హాట్ టాఫిక్‌గా మారింది. పాదయాత్ర నేపథ్యంలో తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ న్యాయస్థానాన్ని కోరగా, నో చెప్పింది. దీంతో ఆయన ప్రతి శుక్రవారం కచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

అసలు విషయానికి వ‌స్తె ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిన జగన్.. అక్టోబర్ 27న.. అంటే శుక్రవారమే పాదయాత్ర ప్రారంభం పెట్టుకున్నారు. పాదయాత్ర ప్రారంభమే శుక్రవారం కావడం, అదే రోజు కోర్టుకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో జగన్, వైసిపి నేతలు పాదయాత్రను వాయిదా వేయనున్నారని తెలుస్తోంది.

నవంబర్ మొదటి వారంలో ప్రారంభం జగన్ పాదయాత్ర వాయిదాపడే అంశంపై వివిధ రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఆ రోజు కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున పాదయాత్రను నవంబర్ 1న లేదా 2న ప్రారంభించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

ప్రారంభం ప్రారంభమే అటు కోర్టుకు హాజరుకావడం, ఇటు పాదయాత్ర ప్రారంభించడం ఇబ్బంది కాబట్టే వాయిదా వేసుకుంటున్నారని తెలుస్తోంది. కోర్టుకు హాజరయ్యే రోజు కాబట్టి వాయిదా వేసుకున్నామని చెబితే బాగుండదు కాబట్టి వైసిపి వ్యూహాత్మకంగా పండితులు, జ్యోతిష్యులు అని తెరపైకి తీసుకొచ్చార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -