Friday, May 3, 2024
- Advertisement -

డిప్రెషన్ లోంచి బయటపడలేక పోతున్న మహేష్ బాబు

- Advertisement -

తెర లేచిన దగ్గర నుంచీ మూత పడే వరకూ కూడా సినిమా లో హీరోలు కేక పుట్టిస్తారు. ఏ సందర్భంలోనూ అలసిపోకుండా, డిప్రెషన్ కి గురి అవ్వకుండా, నిబ్బరం కోల్పోకుండా నిలబడతారు. కష్టాలు ఎదురైనప్పుడు పేజీలకి పేజీలు క్లాసులు పీకుతారు హీరోలు.

ఎక్కడిఅనా కష్టం ఎదురు అయితే హీరోయిన్ దగ్గర బాధ పడి ఒక సాంగ్ ఏసుకుని మళ్ళీ సెట్ అయిపోతారు. అయితే వీరు తెర మీద మాత్రమే హీరోలు నిజ జేవితం ఓ మనలాంటి వారే మరి. ముఖ్యంగా ప్లాప్ పడితే తాను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను అని చెప్పిన మహేష్ బాబు గురించి మాట్లాడుకుంటే ఆగాడు తరవాత రెండు నెలలు  బయటకి రాలేదు మహేష్ బాబు. ఈ విషయం లో అందరూ షాక్ అయ్యారు కూడా. ఆ రెండు నెలలూ తాను రానిది ప్లాప్ కారణంగానే అని మహేష్ స్వయంగా చెప్పడం విశేషం.

ఈ బ్రహ్మోత్సవం దెబ్బ మళ్ళీ మహేష్ ని డిప్రెషన్ లోకి నేట్టేసినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజైన నాటి నుంచీ మహేష్ ఎక్కడా కనపడ్డం లేదు. విడుదల కి ముందర వరకూ ప్రమోషన్స్ లో చాలా జోరుగా కనపడ్డ మహేష్ తరవాత ఎక్కడా కనపడలేదు. ఇంట్లో కొన్నాళ్ళు గడిపి ఫామిలీ తో వెకేషన్ కి వెళ్ళిపోయాడు. ఫిలిం ఫేర్ లో కూడా మనోడు కనపడలేదు. గతంలో ఆ సంస్థ అవార్డు ఇస్తే వచ్చి అందుకున్నాడు.

మా టీవీ.. సాక్షి టీవీ అవార్డులు సైతం అందుకున్న మహేష్.. ఫిలిం ఫేర్ అవార్డు అందుకోవడానికి మాత్రం రాలేదు. బ్రహ్మోత్సవం బాధలో ఉన్న మహేష్ ఇప్పట్లో సెట్ అవుతాడా లేదా అని ఫాన్స్ కంగారు పడుతున్నారు. మురుగదాస్ సినిమా త్వరగా మొదలు అయితే ఆయన కాస్త కూల్ అయ్యే ఛాన్స్ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -