Tuesday, May 6, 2025
- Advertisement -

పవన్ సినిమాలో మహేష్ చేసే సీన్ ఇదే!

- Advertisement -
mahesh babu in pawan kalyan movie

టాలీవుడ్ లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు లకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. ఈ ఇద్దరు హీరోల సినిమాలకు హిట్ టాక్ వస్తే చాలు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ప‌వ‌న్ అత్తారింటికి దారేదితో మ‌హేష్ శ్రీమంతుడు సినిమాతో అప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లో ఉన్న పాత రికార్డులను అన్ని బద్దలను కొట్టారు.

మరి అలాంటిది ఈ ఇద్ద‌రు హీరోలు క‌లిసి ఒకే చిత్రంలో న‌టిస్తే ఆ చిత్రంకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. టాలీవుడ్‌లో ఇటీవ‌ల ఓ స్టార్‌ హీరో సినిమాకు మరో స్టార్ హీరో వాయిస్ ఇవ్వడం చూస్తున్నాం. అప్పుడెప్పుడో పవన్ జల్సా సినిమా కోసం మహేష్ బాబు, రామ్ సినిమాకు ఎన్టీఆర్, సునీల్ సినిమాలో రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త‌గా స్టార్ హీరోల సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల సినిమాల్లో మ‌రో హీరో గెస్ట్ రోల్స్ చేస్తూ వ‌స్తున్నారు.

అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ప‌వ‌న్ సినిమాలో మ‌రో స్టార్ మహేష్ గెస్ట్ రోల్స్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రంగానే చెప్పుకోవాలి. కాటమరాయుడు చిత్రంకు దర్శకత్వం వహిస్తున్న డాలీ అందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. సినిమాపై మరింత క్రేజ్ పెంచేందుకు.. సినిమా ఇంటర్వల్ తర్వాత మహేష్ కోసం ఓ స్ట్రాంగ్ సీన్‌ను రాశాడని చెబుతున్నారు. ఈ ఆలోచ‌న ప‌వ‌న్‌, నిర్మాత శ‌ర‌త్‌మ‌రార్‌కు కూడా న‌చ్చ‌డంతో వారు కూడా మ‌హేష్ కోసం సంప్ర‌దింపులు జ‌రిపే ప‌నిలో ఉన్న‌ట్టు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్‌. మరి ఈ సీన్ లో మహేష్ నటిస్తే ఇటు ప‌వ‌న్‌తో పాటు అటు మహేష్ ఫ్యాన్స్‌కు కూడా కాట‌మ‌రాయుడు పండ‌గ‌లాంటిదే.

Related

  1. పవన్ పొలిటిక‌ల్ కేరీర్‌ నడిపిస్తున్న దర్శకుడు ఎవరో తెలుసా..?
  2. ఎన్టీఆర్ వర్సెస్ పవన్.. పోటీలో గెలుపు ఎవరిది..?
  3. మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టిన మెగాస్టార్!
  4. మహేష్.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -