Friday, May 17, 2024
- Advertisement -

ఎన్టీఆర్ వర్సెస్ పవన్.. పోటీలో గెలుపు ఎవరిది..?

- Advertisement -
NTR and Pawan kalyan Targets August 11th

సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణలు పోటీ పడ్డారు. ఈ బరిలో ఇద్దరూ మంచి విజయం సొంతం చేసుకున్నారు. పక్కా కమర్షియల్ సినిమాగా ఖైదీ నంబర్ 150తో మెగాస్టార్ ప్రభంజనం సృష్టిస్తే.. చారిత్రక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో బాలయ్య కూడా ప్రభంజనం సృష్టించారు. ఈ చిత్రం బాలయ్య కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఇపుడు మరోసారి మెగా వర్సెస్ నందమూరి పోటీ జరగనున్నట్లు కనిపిస్తోంది. ఈసారి పవన్ కళ్యాణ్-ఎన్టీఆర్ లు పోటీ పడే చాన్స్‌లు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం పవన్ కాటమరాయుడు పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. మరోవైపు బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ ఫిబ్రవరి 11న మొదలు కానుంది. పవన్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కావాల్సి ఉంది. కానీ ఈ రెండు చిత్రాలు ఒకే తేదీన విడుదలకి టార్గెట్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఆగస్ట్ 11 డేట్ ని టార్గెట్ చేసి పవన్.. ఎన్టీఆర్ లు తమ చిత్రాలను విడుదలకు రెడీ చేశారట.

ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న  బాబీ దగ్గర.. ఇటు పవన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్ దగ్గర.. బౌండ్ స్క్రిప్ట్ ఉండడంతో జూలై చివరకు ఫినిష్ చేయడం అంత కష్టం కాదని తెలుస్తోంది. ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి మెగా వర్సెస్ నందమూరి పోటీని ఎంజాయ్ చేసిన అభిమానులు.. ఇండిపెండెన్స్ డేకి మరోసారి ఇదే రేస్ ని చూసే అవకాశం ఉందన్న మాట.

Related

  1. ఎన్టీఆర్ రికార్డులను బద్దలు కొట్టిన రామ్ చరణ్!
  2. ఎన్టీఆర్ వల్లనే.. నా కెరీర్ నాశనం అయింది!
  3. అనూప్ పై సీరియస్ అయిన పవన్.. ఎందుకో తెలుసా..?
  4. అన్నయ్యను ఇంటికి వెళ్లిన పవన్.. ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -