Friday, May 17, 2024
- Advertisement -

మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టిన మెగాస్టార్!

- Advertisement -
khaidi crosses srimanthudu record

ఈ గత రెండు మూడేళ్లుగా తెలుగు సినిమా మార్కెట్ బాగా పెరిగిపోయింది. పెద్ద హీరోల సినిమాలు హిట్ అయితే 100 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ ఈ సంక్రాంతికి రిలీజైన ఖైదీ నంబర్ 150 కలెక్షన్స్ లో న్యూ రికార్డ్ క్రియేట్ చేసిందని టాక్. తెలుగు చిత్రాల మార్కెట్ ను బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని డివైడ్ చేసి వసూళ్ల లెక్కలు చెప్పారు. వాస్తవానికి ఆ చిత్రంకు ముందు తెలుగు సినిమా వసూళ్ల గురించి ఎవరౌ పెద్దగా చెప్పుకునేవారు కాదు.

ఆ సినిమా కలెక్షన్స్ ను ఇంతవరకూ మరే తెలుగు చిత్రం క్రాస్ చేయలేకపోయింది. ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్స్ చిత్రాల మధ్య పోటీ మామూలుగా లేదు. కలెక్షన్స్ లో ఒక హీరో సినిమాను మరో హీరో మూవీ బీట్ అవుట్ చేస్తోంది. 2015లో వచ్చిన మహేష్ బాబు మూవీ శ్రీమంతుడు – కలెక్షన్స్ లో బాహుబలి తర్వాత ప్లేస్ సాధించింది. అయితే .. లేటెస్ట్ టాక్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150 – మహేష్ బాబు శ్రీమంతుడు ను క్రాస్ చేసిందట.

ఈ నెల 11న రిలీజైన చిరంజీవి సినిమా కేవలం 12 రోజుల్లోనే 92 కోట్ల రూపాయల షేర్ ను రీచ్ అయి శ్రీమంతుడు రికార్డును బీట్ చేసిందట. నిన్నటివరకు బాహుబలి చిత్రం తర్వాత సెకండ్ ప్లేస్ లో శ్రీమంతుడు ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్‍ని ఖైదీ నంబర్ 150 కొట్టేసింది. అయితే కొన్ని రోజుల తర్వాత మెగాస్టార్ సినిమా రాజమౌళి బాహుబలిని కూడా ఓవర్ టేక్ చేసి వన్ కావచ్చని అంటున్నారు. చిరు ఖైదీ నంబర్ 150 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు గ్రాస్ ను 85 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. అతి త్వరలోనే 200 కోట్లు రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Related

  1. మహేష్.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్!
  2. లీకైన మహేష్ సినిమా కథ ఇదే!
  3. మురుగదాస్ కి ఖైదీ సినిమా ఎందుకు నచ్చలేదంటే..?
  4. ఫ‌స్ట్ వీక్ లో ఖైదీ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -