Sunday, May 19, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్‌లో మహేశ్ బాబు?

- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్ గురించి రోజుకో ఓ వార్త బ‌య‌టికి వ‌స్తుంది. ఈ బ‌యోపిక్‌లోకి డైరక్టర్‌గా క్రిష్ ఎంట్రీ చేసాక బయోపిక్ పూర్తిగా మారిపోతోంది. ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఆయ‌న జీవితంలో చోటు చేసుకున్న ప్ర‌తి స‌న్నివేశాన్ని తెర‌కెక్కించాలి. ఇప్ప‌టికే చాలామంది న‌టీన‌టుల‌ ఎంపిక పూర్తి అయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

ఎన్టీఆర్ బయోపిక్‌లో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ న‌టిస్తున్నార‌నే వార్త విన‌బ‌డుతుంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో హీరో కృష్ణ క్యారెక్టర్‌లో నటించడానికి ఆయన తనయుడు మహేశ్‌ బాబును ఒప్పించినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మ‌రి దీనిపై అటు మ‌హేశ్ కాని, ఇటు బాల‌య్య గాని ఎటువంటి అనౌన్స్‌మెంట్ చేయ‌లేదు. బయోపిక్‌లో క్రేజ్ ఉన్న న‌టుల‌ను తీసుకుంటే సినిమా రేంజ్ పెరుగుతుంద‌ని బాలయ్య భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -