Monday, May 20, 2024
- Advertisement -

వైఎస్‌పై ప్రజాభిమానం…… బాబుకి షాకిచ్చిందా?

- Advertisement -

2019 ఎన్నికల్లో తనను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు గెలిపిస్తారా అన్న సందేహాలు చంద్రబాబులో గట్టిగానే ఉన్నాయి. అందుకే ఇప్పటి నుంచి తనకు ఎందుకు ఓట్లు వేయరు అని ప్రశ్నిస్తున్నాడు. తనకు తప్ప ఇంకెవరికీ ఓట్లు వేసినా మీ బతుకులు కుక్క చింపిన విస్తర్లే అని ఓటర్లను బెదిరిస్తున్నాడు. తాను తప్ప ఇంకెవరు ముఖ్యమంత్రి అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అథోగతి పాలవుతుందని ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు చంద్రబాబు. 2014ఎన్నికల సమయంలో కూడా ఇవే మాటలు చెప్పాడు చంద్రబాబు.

రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని తాను ఒక్కడే కాపాడగలడు అన్న రేంజ్‌లో బిల్డప్ ఇచ్చాడు. ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీలు నెరవేరాలంటే తనను ముఖ్యమంత్రిని చేయాలన్నాడు. అయితే 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయాడు. ఇక మోడీ నుంచి తీసుకురావాల్సిన వాటిని కూడా తీసుకురావడంలో పూర్తిగా ఫెయిలయ్యాడు బాబు. అందుకే 2019 ఎన్నికలకు కొత్త హామీలు ఇవ్వాలంటే జనాలు నమ్ముతారో నమ్మరో అని భయపడుతున్నాడు. కొత్త హామీలకంటే చాలా పనులు చేశా అని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా పోలవరం క్రెడిట్ మొత్తం నాదే అని చెప్పుకుంటున్నాడు చంద్రబాబు. ప్రాజెక్ట్ నిర్మాణమే మొదలు కాకుండా ఉన్నప్పటికీ పునాదుల నిర్మాణాన్ని కూడా జాతికి అంకితం అంటూ పబ్లిసిటీ స్టంట్ చేయడం చంద్రబాబుకే సాధ్యం.

అయితే ఓ రేంజ్‌లో ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ప్రజలు మాత్రం పోలవరం నిర్మాణ క్రెడిట్‌ని వైఎస్ రాజశేఖరరెడ్డి ఖాతాలో వేస్తున్నారని తాజాగా చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. గతంలో సమైక్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చేసింది ఏమీ లేదని ప్రజలు భావిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. గోదావరి జిల్లాల ప్రజలు కూడా పోలవరం నిర్మాణాన్ని ప్రారంభించడం, పోలవరం నిర్మాణం కోసం ఎక్కువ కష్టపడిన నాయకుడిగా వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తిస్తూ ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పడం బాబును షాక్‌కి గురిచేసింది. అందుకే ఇప్పుడు పోలవరం క్రెడిట్ మొత్తం బాబుదే. పోలవరం నిర్మాణాన్ని ప్రారంభించింది…. పోలవరం కోసం తపనపడింది చంద్రబాబే అని చెప్పి ఎల్లో మీడియాలో కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖర్చుతో సరికొత్త ప్రచారానికి మరోసారి తెరలేపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశాడట. జగన్ పాదయాత్ర గోదావరి జిల్లాల్లో భారీగా ప్రభావం చూపిస్తూ ఉండడంతో పోలవరం నిర్మాణ సారథి, అపర భగీరథుడిగా చంద్రబాబు గురించి ప్రచారం చేసి కొంతలో కొంత అయినా గోదావరి ప్రజల ఆలోచనలు డైవర్ట్ చెయ్యాలన్నది టిడిపి ఆలోచన. నాలుగేళ్ళు సోమవారాన్ని పోలవారంగా మార్చేశానంటూ చేసిన భారీ ప్రచారాన్నే నమ్మని ప్రజలు…..ఇప్పుడు కొత్తగా చేయబోతున్న ప్రచారాన్ని నమ్ముతారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -