హిందీ – తమిళం అనే తేడా లేకుండా అటు ఉత్తరాదినా ఇక్కడ దక్షిణాది నా హిట్ సినిమాలు అందుకున్నాడు డైరెక్టర్ మురుగదాస్. సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి అక్కడ తన సత్తా చాటిన మురుగదాస్ బాలీవుడ్ కి గజినీ లాంటి సూపర్ క్లాసిక్ ని ఇచ్చాడు తరవాత ఇక్కడి తుపాక్కీ సినిమా అక్కడ హాలిడే గా తీసి అక్షయ్ కుమార్ లో పెద్ద హిట్ అందించాడు. అందుకే అతడికి ఉత్తరాది పరిశ్రమలో బోలెడంత క్రేజు.
మురుగదాస్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే అది హిట్టే అన్నంత నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. అతడి కాల్షీట్ల కోసం ముంబై హీరోలంతా పోటీపడుతున్నారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం మురుగదాస్ తో ఒక సినిమా కోసం చాలా ఉబలాట పడుతున్నాడు.
ఎలాగైనా 2016 లో మురుగదాస్ తో ఒక సినిమా చేసి తీరాలి అనేది సల్మాన్ ఆలోచన. మురుగదాస్ ప్రస్తుతం అకీరా అనే సినిమా లో సోనక్షి తో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా అవ్వగానే మహేష్ బాబు తో సినిమా ఉంది కానీ దీనికంటే ముందరే సల్మాన్ తో సినిమా తీయాలి అనేది మురుగదాస్ మీద ఉన్న ఒత్తిడి.
అకీరా సినిమా పూర్తవడానికి సిద్దంగా ఉంది. 2016 సమ్మర్ లో కానీ మహేష్ ఫ్రీ అవడు సో ఇలోగా సల్మాన్ ఖాన్ తో సినిమా తీస్తే అది పూర్తేయ్యేలోగా మహేష్ ఖాళీ అవుతాడు అని చూస్తున్నాడట.
కానీ మహేష్ మాత్రం సల్లూ భాయ్ తో సినిమా అంటే చాల సమయం పడుతుంది అని తన సినిమాకి కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి అది పూర్తైన తరవాతనే సల్మాన్ కి చెయ్యాలని కోరుతున్నాడు. సో మురుగదాస్ కోసం ఇద్దరూ ఇలా కొట్టుకుంటున్నారు.
