Friday, May 3, 2024
- Advertisement -

ఈ సారి పోసాని సెటైర్ ఎవరి మీద ?

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో పోసాని కృష్ణ మురళీ కి గత ఐదారేళ్ళ సమయంలో చాలా పెద్ద పేరొచ్చింది. ఒకరకమైన సంచలనం గా మారాడు ఆయన. మెంటల్ కృష్ణ గా ప్రేక్షకులకి చేరువైన పోసానిని ఇప్పటికీ చాలా మంది అదే పేరుతో గుర్తు పడుతూ ఉంటారు. ఆయన పాత్రలు నెమ్మది నెమ్మదిగా మెంటల్ వైపు నుంచి నార్మల్ వైపుకు రావడం మొదలేట్టాయి. 

సమాజం మీద ముక్కుసూటి తనంతో మాట్లాడాలి అంటే పోసానికే చెందింది అని చెప్పాలి. టీవీ చానల్స్ లో మాట్లాడినా మరెక్కడైనా స్పీచ్ లు ఇచ్చినా పోసాని తనదైన శైలి లో చితక్కోట్టేస్తారు. పోసాని రచయిత నుంచి దర్సకత్వం వైపూ దర్సకత్వం నుంచి నటుడి వైపూ వివిధ స్టేజీ లు దాటుకుంటూ వచ్చి ఇప్పుడు స్థిరంగా ఇందులోనే ఉంటున్నారు.

ఆయన చేసే  ప్రతీ క్యారెక్టర్ సంఘం మీద ఒక సెటైర్ లా ఉంటుంది అనడం అతిశయోక్తి కాదేమో. ఈ మధ్య ఎన్టీఆర్ సినిమా టెంపర్ లో తన పాత్రతో రెచ్చిపోయిన పోసాని సినిమాకి ఊపిరి పోశారు. పోలీసు ఉద్యోగాల్లో సిన్సియర్ పోలీసు ఎలా మనసు చంపుకుని బతుకుతున్నాడు అనే విషయాన్ని చూపిస్తూ సాగింది ఆయన నైజం. 

కొత్తగా వస్తున్న రవితేజ – సంపత్ నంది ల కాంబినేషన్ సినిమా బెంగాల్ టైగర్ ఈ నెల 10 న విడుదల అవుతూ ఉండగా ఈ సినిమా కోసం పోసాని చేస్తున్న క్యారెక్టర్ గురించి కొత్త వార్తలు వస్తున్నాయి. సెలబ్రిటీ శాస్ర్తి అనేది క్యారెక్టర్ నేమ్.

తెల్లని చొక్కా – పంచె కట్టు – వైట్ అండ్ వైట్ మీద ఓంకార నామాలు – పిల్లనగ్రోవి పట్టిన కృష్ణుడి బొమ్మలతో ఓ పసుపు రంగు కోటు ధరించి ఊరిమీదకి బయల్దేరే క్యారెక్టర్ ఇది.  ఈ పాత్రతో ఎవరో జాతకాలు చెప్పే సెలెబ్రిటీ వ్యక్తికి , ఎప్పుడూ టీవీ లో కనిపించే ఆయనకీ సెటైర్ వేస్తున్నారు అని తెలుస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -