Thursday, May 16, 2024
- Advertisement -

నయనతారకు ఇస్తే.. తనకూ ఇవ్వాలట

- Advertisement -

కోలీవుడ్ ప్రొడ్యూసర్లకు హీరోయిన్ త్రిష చుక్కలు చూపిస్తోంది. తనకు అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న విషయాన్ని కూడా మరిచిపోయి.. వచ్చిన వాళ్లను కూడా భారీ రెమ్యూనరేషన్ అడుగుతూ బెదరగొడుతోంది. విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో సినిమాకు సైన్ చేసేందుకు.. త్రిష పెట్టిన కండిషన్లు విన్న దర్శకనిర్మాతలు.. ఆఖరికి వేరే హీరోయిన్ ను తీసుకుంటే బాగుండేదనుకునే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది.

3 వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూకుడు మీదున్న నయనతార.. రీసెంట్ గా ఇంకో సినిమాను ఓకే చేసింది. అంతకుముందు విక్రమ్ తో చేస్తున్న సినిమాకు.. 3 నుంచి మూడున్నర కోట్ల మొత్తం రెమ్యూనరేషన్ గా తీసుకుంటోందని వార్తలు వచ్చిన సంగతి అందిరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా.. విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో నయనతార సైన్ చేసిన కొత్త సినమాకు కూడా భారీ పారితోషం అందుకోబోతోందట.

ఇదేమంత పెద్ద విషయం కాకున్నా.. మధ్యలో త్రిష ఇచ్చిన ట్విస్ట్.. కొత్త సినిమా యూనిట్ ను షాక్ కు గురి చేసినట్టు తెలుస్తోంది. ఇదే సినిమాలో ఇంకో హీరోయిన్ గా త్రిషను యాక్ట్ చేయమని అడిగితే.. రెమ్యూనరేషన్ విషయంలో త్రిష కండిషన్స్ అప్లై అని స్పష్టం చేసినట్టు సమాచారం. తనతో పాటు నయనతార కూడా ఈ సినిమాలో నటిస్తుండడంతో.. తనకు సమాన గౌరవం కావాలన్నదే త్రిష కండిషన్ అని టాక్.

నయనతారకు ఇచ్చే రెమ్యూనరేషన్ లో.. తనకు కనీసం 75 శాతం ఇస్తేనే నటిస్తానని త్రిష తెగేసి చెప్పడంతో.. దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ముందుగా అనుకున్న రెమ్యునరేషన్ కంటే కాస్త ఎక్కువే ఇస్తామని ఇప్పుడు చర్చలు కంటిన్యూ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -