Wednesday, April 24, 2024
- Advertisement -

పిల్లల్ని హత్తుకొని ఎమోషనల్ అయిన అల్లు అర్జున్..ఎందుకంటే?

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం తనకు కరోనా వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించి తన ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో సురక్షితంగా ఉన్నానని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని అయితే తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.

తాజాగా క్వారంటైన్‌లో ఉన్న అల్లు అర్జున్ కరోనా టెస్ట్ చేయించుకోగా కరోనా నెగెటివ్ రావడంతో దాదాపు పదిహేను రోజులు తరువాత క్వారంటైన్ నుంచి బయటపడటంతో బన్నీ తెగ సంబరపడిపోతు తన పిల్లలను ముద్దాడి ఎమోషనల్ అయ్యారు. అయాన్‌ను హత్తుకున్న బన్నీ చిన్నపిల్లాడిగా తన కొడుకును పట్టుకుని తెగ మురిసిపోతూ నేల మీద దొర్లాతు తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Also read:లాక్ డౌన్ లో ప్రియుడితో సరసాలు.. పెళ్లికి ముందే హల్చల్ చేస్తున్న శృతిహాసన్!

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హ్యాట్రిక్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం “పుష్ప” వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2, సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి వీరి కాంబినేషన్లో వస్తున్న “పుష్ప” మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి.ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Also read:ఎన్టీఆర్ కు కరోనా రావడానికి కారణం వాళ్లేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -