Wednesday, May 15, 2024
- Advertisement -

రేణు రెండో పెళ్లికి సపోర్ట్ చేసిన మహేష్

- Advertisement -

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ పేరు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ అవుతోంది. ఆమె రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఇటివలే తెలిపింది. ఇక అప్పటి నుంచి ఫ్యాన్స్ ఆమె పై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు అనుకూలంగా కామెంట్స్ చేస్తే.. మరికొందరు ప్రతికూలాంగా స్పదింస్తున్నారు.

‘పవన్ కళ్యాణ్‌ని అన్నయ్యగా, మిమ్మల్ని వదినగా భావిస్తున్నాం. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటే మీపై ఉన్న గౌరవం మొత్తం పోతుంది అన్నయ్యని అభిమానించే ప్రతి ఒక్కరు మిమ్మల్నీ అభిమానుస్తున్నారు. ఆ అభిమానాన్ని మిస్ చేసుకోవద్దు” ఇలాంటి ట్వీట్లు పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై సినీ ఎనలిస్ట్ కత్తి మహేష్ దూరాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు.. రేణూ దేశాయ్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లోకి ఎందుకు వెళ్తున్నారని మహేష్ కత్తి నిలదీశాడు.

ఏడు సంవత్సరాల ఒంటరి జీవితం తర్వాత రేణూ దేశాయ్ పెళ్లి చేసుకుంటానంటే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి ఏమిటి అభ్యంతరం? ఆ తిట్టడం ఏమిటి! ఆ ట్రాల్స్ ఏమిటి? ఇంత మూర్ఖత్వం ఏమిటి? ఇంత పర్వార్టెడ్ భావజాలం ఏమిటి? ఇవేవీ కనిపించనంతగా మీ కళ్ళు మూసుకుపోవడం ఏమిటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది’ అని ఓ పోస్ట్ చేశాడు మహేష్ కత్తి. మరి పవన్ ఫ్యాన్స్ దీనీపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -