Monday, May 20, 2024
- Advertisement -

టీడీపీ దిమ్మతిరిగే షాక్.. వైసీపీలోకి సీనియర్ నేత మాజీ మంత్రి

- Advertisement -

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి.. ఆ పార్టీకి చెందిన నాయకులు ఒకరు తర్వాత ఒకరు షాక్‍ల మీడ షాక్‍లు ఇస్తున్నారు. టీడీపీ నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఇటివలే జరిగిన మంత్రి వర్గ విస్తరణలో.. పార్టీ పదవుల పంపకంలో.. జరిగిన అన్యాయంను వ్యక్తం చేస్తూ తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది అయితే అధికార పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటున్నారు.

మరికొందరు ఏకంగా పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు బాగా సన్నిహితుడు, టీడీపీ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నాయకుడు మాజీ మంత్రి శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి వచ్చే ఎన్నికల్లోపు టీడీపీ కి గుడ్ బై చెప్పడమే కాకుండా ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని బొజ్జల అనుచరవర్గం అంటున్నారు. ఇటివలే జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కానీ పార్టీ పదువుల పంపకం విషయంలో కానీ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ను తీవ్రంగా అవమానించడంతో.. ఆయన ఈ నిర్ణంకు వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ పార్టి అధికారంలో ఉన్నప్పుడు.. ఎప్పుడు కూడా మంత్రిగా లేరు. అలాంటిది ప్రస్తుతం బాబు హాయంలో మంత్రిగా ఉన్న ఆయన్ని తప్పించడమే కాకుండా పార్టీ పదవి ఇవ్వకపోవడం.. జరిగింది. అయితే తానూ రాజకీయాలకు దూరంగా ఉన్న కానీ తన తనయుడు అయిన బొజ్జల సుధీర్ రెడ్డిని రంగంలోకి దించనున్నారనే టాక్ కూడా ఉంది.

అయితే వచ్చే ఎన్నికల్లో ఇరవై మంది దాక ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వని తేల్చి చెప్పిన చంద్రబాబు ఆ జాబితాలో బొజ్జల కూడా ఉన్నారు అని అంటున్నారు. తనకు కాకపోయిన తన కొడుకుకి ఇవ్వాలని బొజ్జల అడిగారట. కానీ బాబు నుంచి ఎలాంటి స్పందన లభించలేదట. దాంతో తన సీనియారిటీ పవర్ ఏంటో వైసీపీలోకి చేరి చూపించాలని ఆయన ఉవ్విరిల్లుతున్నారని జిల్లా రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి. మరి బొజ్జల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -