Monday, May 13, 2024
- Advertisement -

మ‌హేష్ స్నేహితుడిగా అల్ల‌రోడు

- Advertisement -

టాలీవుడ్‌లో హీరోలు మంచి రోల్స్ వ‌స్తే చిన్న పాత్ర‌లు చేయ‌డానికి అయిన వెన‌కాడ‌టం లేదు. మహేష్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించడానికి రెడీ అవుతున్నాడు. గ‌తంలో దీనిపై స్పందించిన న‌రేష్ త‌న పాత్ర గురించి తెలియ‌ద‌ని మ‌హేష్ సినిమా కోసం నన్ను ద‌ర్శ‌కుడు క‌లిశారు అని పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో చెబుతాన‌ని చెప్పిన న‌రేష్‌, ఇప్పుడు త‌న పాత్ర గురించి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

అల్లరోడు మహేష్ స్నేహితుడిగా కనిపించబోతున్నాడు. ఎక్కువగా అమెరికాలో జరిగే ఈ కథలో ఎప్పుడు కనిపించని లొకేషన్స్ దర్శనమిస్తాయట. గతంలోనే వంశీ పైడిపల్లి లొకేషన్స్ కోసం అమెరికాను జల్లెడ పట్టాడు. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది.అయితే చిత్ర యూనిట్ అర్జున్ రెడ్డి భామ షాలిని పాండేని సెలెక్ట్ చేసింది మ‌హేష్ కోసం కాద‌ని తెలుస్తుంది.అల్ల‌రి న‌రేష్ ల‌వ‌ర్‌గా షాలిని న‌టిస్తుంద‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -