Saturday, May 18, 2024
- Advertisement -

ఎవరు టాప్…

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్… సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇద్దరిలో ఎవరు నెంబర్ వన్. ఈ విషయం తేలడానికి ఇంకెన్నాళ్లో లేదు.. కేవలం రెండు నెలల్లోనే వీరిద్దరి స్ధానం ఏమిటో తేలిపోనున్నది. ఎలా అంటారు. ఈ వేసవిలో అంటే మే నెలలో వీరిద్దరు సినిమాలు విడుదలవుతున్నాయి.

ఆ సినిమాల విడుదల తర్వాత నెంబర్ వన్ స్థానం ఎవరిదో తెలిపోతుందంటున్నారు సినీ పండితులు. పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం చిత్రాలు కొద్ది రోజుల గ్యాప్ లో మే నెలలో విడుదల కానున్నాయి. ఈ చిత్రాల విజయమే కాదు… వాటి వసూళ్లు కూడా ఇద్దరిలో ఎవరు నెంబర్ వన్ అనేది తేల్చేస్తుంది.

దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా విడుదలవుతున్న ఈ రెండు సినిమాలు ఆ హీరోల స్ధానాన్ని ఖరారు చేయనున్నాయి. మహేష్ బాబు చిత్రం బ్రహ్మోత్సవం ఇప్పటికే విదేశీ మార్కెట్ ని శాసిస్తోంది. ఇక పవన్ కల్యాణ్ సినిమా ఏమవుతుందో వేచి చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -